Homeఎంటర్టైన్మెంట్Vishnu Vinyasam Pre Release Business: రిలీజ్ కి ముందే భారీ లాభాలు..19 కోట్లు...

Vishnu Vinyasam Pre Release Business: రిలీజ్ కి ముందే భారీ లాభాలు..19 కోట్లు పెట్టి తీస్తే ‘ విష్ణు విన్యాసం’ ఎంత బిజినెస్ చేసిందో తెలుసా!

Vishnu Vinyasam Pre Release Business: ఈమధ్య కాలం లో వరుస సూపర్ హిట్ సినిమాలతో శ్రీ విష్ణు(Sree Vishnu) తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ముఖ్యంగా ఈయన కామెడీ టైమింగ్ కి చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే ఆయన కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా చేస్తే, మార్కెట్ లో ఆయన సినిమా బిజినెస్ హాట్ కేక్ లాగా సేల్ అయ్యే పరిస్థితి ఉంది. రీసెంట్ గా ఆయన హీరో […]

Vishnu Vinyasam Pre Release Business: ఈమధ్య కాలం లో వరుస సూపర్ హిట్ సినిమాలతో శ్రీ విష్ణు(Sree Vishnu) తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ముఖ్యంగా ఈయన కామెడీ టైమింగ్ కి చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే ఆయన కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా చేస్తే, మార్కెట్ లో ఆయన సినిమా బిజినెస్ హాట్ కేక్ లాగా సేల్ అయ్యే పరిస్థితి ఉంది. రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన చిత్రం ‘విష్ణు విన్యాసం'(Vishnu Vinyasam). ఈ నెల 28వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. కారణం రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ రావడమే. శ్రీ విష్ణు మార్క్ కామెడీ టైమింగ్ తో ట్రైలర్ మొత్తాన్ని నింపేశారు. ముఖ్యంగా ట్రైలర్ చివరి షాట్ లో ఆయన చెప్పిన డైలాగ్ ఒక్కటి చాలు, ఈ సినిమాకు యూత్ ఆడియన్స్ కళ్ళు మూసుకొని టికెట్స్ బుక్ చేసుకోవడానికి.

అయితే ఈ సినిమాని నిర్మించడానికి దాదాపుగా 19 కోట్ల రూపాయిల బడ్జెట్ ఖర్చు అయ్యిందట. అయితే రిలీజ్ కి ముందే ఈ చిత్రం బిజినెస్ ద్వారా నిర్మాతకు టేబుల్ ప్రాఫిట్స్ ని తెచ్చి పెట్టిందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. వాళ్ళు చెప్తున్నా లెక్కల ప్రకారం, ఈ సినిమాకు థియేట్రికల్ రైట్స్ + నాన్ థియేట్రికల్ రైట్స్ కలిపి 26 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగిందట. ఒకవేళ సినిమా థియేటర్స్ లో హిట్ అయితే , లాభాలు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కేవలం నాలుగైదు చిత్రాలతో శ్రీ విష్ణు తన మార్కెట్ ని ఎలా పెంచుకున్నాడో చూడండి. ఈ సినిమా కూడా హిట్ అయితే ఇక ఆయన రేంజ్ ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకుంటుంది. అసలే థియేటర్స్ లో సరైన సినిమా లేదు.

సంక్రాంతికి భారీ లాభాలను చూసిన బాక్స్ ఆఫీస్, ఫిబ్రవరి నెలలో మాత్రం వెలవెలబోయింది. విడుదలైన ప్రతీ సినిమా ఫ్లాప్ అయ్యింది. ‘కపుల్ ఫ్రెండ్లీ’ కి టాక్ అయితే అద్భుతంగా వచ్చింది కానీ, కలెక్షన్స్ మాత్రం ఆ రేంజ్ లో రావడం లేదు. అదే విధంగా భారీ అంచనాల నడుమ విడుదలైన విశ్వక్ సేన్ ‘ఫంకీ’ కూడా ఘోరమైన డిజాస్టర్ గా నిల్చింది. ఇలాంటి డ్రై పీరియడ్ లో ‘విష్ణు విన్యాసం’ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మళ్లీ థియేటర్స్ కళకళలాడుతాయి. ఈ చిత్రం తో పాటు శ్రీ విష్ణు హీరో గా నటించిన ‘మృత్యుంజయ్’ చిత్రం కూడా ఫిబ్రవరి 28 నే విడుదల కాబోతుంది . అయితే ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని కొంతమంది అంటున్నారు. అందులో ఎంత వరకు నిజముందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper