Homeఎంటర్టైన్మెంట్Vishnu Vinyasam Day 2 Collections Worldwide: మొదటిరోజు కంటే 2వ రోజు ఎక్కువ వసూళ్లు.....

Vishnu Vinyasam Day 2 Collections Worldwide: మొదటిరోజు కంటే 2వ రోజు ఎక్కువ వసూళ్లు.. దుమ్ములేపేస్తున్న ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam Day 2 Collections Worldwide: ఈ ఫిబ్రవరి నెలలో విడుదలయ్యే ప్రతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అవుతుంటే బయ్యర్స్ ఎంత బాదపడ్డారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. టాక్ వచ్చిన సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లను రాబట్టలేక తేలిపోయాయి. అలాంటి సమయం లో అందరూ శ్రీవిష్ణు హీరో గా నటించిన ‘విష్ణు విన్యాసం’ చిత్రం మీద బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. అలా భారీ ఆశలు , అంచనాలు మధ్య విడుదలైన ఈ చిత్రానికి కాస్త డివైడ్ టాక్ వచ్చింది. కానీ ఆ టాక్ ఓపెనింగ్స్ పై ఎలాంటి ప్రభావం చూపలేదు. మొదటి రోజు ఈ చిత్రానికి గంటకు 2 వేల టికెట్స్ బుక్ మై షో యాప్ లో అమ్ముడుపోతే రెండవ రోజు గంటకు 4 వేల టికెట్స్ అమ్ముడుపోయాయి. దీనిని బట్టే ఈ చిత్రానికి పబ్లిక్ లో ఎలాంటి మౌత్ టాక్ ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. డివైడ్ టాక్ కేవలం సోషల్ మీడియా లో మాత్రమే ఉంది.

Also Read: అల్లు అరవింద్ ని ఆ రోల్ కోసం బ్రతిమిలాడాను… కానీ ఇవ్వలేదు – హీరో రాజశేఖర్

ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రెండవ రోజు 2 కోట్ల 50 లక్షల రూపాయలకు పైగానే షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట. అదే కనుక జరిగితే ఈ చిత్రానికి కేవలం రెండు రోజుల్లోనే నాలుగు కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వస్తాయి, ఓవరాల్ మొదటి వీకెండ్ కలిపి 6 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. విడుదలకు ముందు ఈ చిత్రానికి జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 12 కోట్ల రూపాయిల వరకు ఉందట. అంటే మొదటి వీకెండ్ లో ఈ చిత్రం 50 శాతం రీకవరీ ని సొంతం చేసుకోబోతుంది అన్నమాట. రాబోయే రోజుల్లో డీసెంట్ స్థాయి థియేట్రికల్ రన్ ఉన్నా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని లాభాల్లోకి అడుగుపెడుతుంది.

మరి ఆ రేంజ్ కి ఈ చిత్రం వెళ్తుందో లేదో చూడాలి. ఫిబ్రవరి నెలలో పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలు కూడా భారీ వసూళ్లను రాబట్టలేక ఫ్లాప్ అవుతుంటే, శ్రీవిష్ణు సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కూడా బ్రేక్ ఈవెన్ వైపు దూసుకెళ్లే సూచనలు కనిపించడమంటే , ఆయనకు యూత్ ఆడియన్స్ లో బ్రాండ్ ఇమేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ‘సమజవరగమనా’, ‘ఓం భీం బుష్ ‘, ‘స్వాగ్’, ‘సింగిల్ ‘ వంటి చిత్రాలు శ్రీవిష్ణు కెరీర్ కి చాలా బాగా ఉపయోగపడింది అనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత మార్చి 6 న ఆయన హీరో గా నటించిన ‘మృత్యుంజయ్ ‘ అనే సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమా శ్రీ విష్ణు సక్సెస్ స్ట్రీక్ ని కొనసాగిస్తుందా , లేదా బ్రేక్ వేస్తుందా అనేది చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular