Vishnu Vinyasam 3 Days Collections: శ్రీవిష్ణు(Sree Vishnu) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘విష్ణు విన్యాసం'(Vishnu Vinyasam) మొదటి ఆట నుండే కాస్త డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, హీరో శ్రీవిష్ణు కి యూత్ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ కారణంగా , ఈ చిత్రం ఇప్పుడు బ్లాక్ బస్టర్ ఫలితం వైపు అడుగులు వేస్తోంది. మూడవ రోజున ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో దాదాపుగా 35 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. అలా మొదటి మూడు రోజులకు కలిపి కేవలం బుక్ మై షో యాప్ నుండే ఈ చిత్రానికి 1 లక్షా 20 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. డివైడ్ టాక్ తో మీడియం రేంజ్ హీరో సినిమాకు ఈ స్థాయిలో టికెట్స్ అమ్ముడుపోవడం అనేది సాధారణమైన విషయం కాదు. ఇదంతా పక్కన పెడితే మొదటి నుండి ఈ చిత్రానికి 12 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగిందని చెప్పుకుంటూ వచ్చారు.
కానీ వాస్తవానికి ఈ సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం 8 కోట్ల రూపాయిలు మాత్రమేనట. మరి ఈ మూడు రోజుల్లో ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఇంకా ఎంత వసూళ్లను రాబట్టాలి అనేది ఇప్పుడు వివరంగా చూద్దాం. మొదటి రెండు రోజులకు కలిపి 4 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , మూడవ రోజున కోటి 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . అలా ఓవరాల్ గా ఈ చిత్రానికి మూడు రోజులకు కలిపి 5 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి ఇక కేవలం 2 కోట్ల 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే రావాలి.
Alos Read: విజయ్ దేవరకొండ – రష్మిక లకు అల్లు అర్జున్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడుగా…
ఈరోజు , రేపు యావరేజ్ రేంజ్ లో హోల్డ్ చేసినా బ్రేక్ ఈవెన్ మార్కుని అవలీలగా అందుకోగలదు. చూడాలి మరి ఈ సినిమా ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది. మొత్తం మీద ఫిబ్రవరి నెలలో వరుస ఫ్లాప్స్ నుండి ఈ చిత్రం కాస్త ఉపశమనం కలిగించేలా చేసింది. మార్చ్ 19 వరకు మరో కొత్త సినిమా లేదు కాబట్టి కచ్చితంగా ఈ చిత్రం 20 కోట్ల షేర్ మార్కుని అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు .