https://oktelugu.com/

Bigg Boss 8 Telugu: నిఖిల్ మరియు నైనికా టీమ్స్ ని తోక్కేసిన యష్మీ..ఏరికోరి నెత్తిన పెట్టుకున్నందుకు తగిన శాస్తి జరిగింది!

యష్మీ ని చీఫ్ గా చేసేందుకు నిఖిల్ అనేక మంది కంటెస్టెంట్స్ తో గొడవలు కూడా పడ్డాడు. కానీ చివరికి అతనికే టీం లేకుండా పోయింది. యష్మీ మరియు నైనికా టీం లో చెరో నలుగురు కంటెస్టెంట్స్ ఉండగా, నిఖిల్ టీం లో కేవలం ముగ్గురు మాత్రమే మిగిలారు.

Written By:
  • Vicky
  • , Updated On : September 7, 2024 / 09:15 AM IST

    Bigg Boss 8 Telugu(22)

    Follow us on

    Bigg Boss 8 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో మోస్ట్ లక్కీ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది యష్మీ గౌడ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈమె హౌస్ లోకి నిఖిల్ కి జంటగా అడుగుపెట్టింది. అతనితో స్నేహం చేయడం వల్ల పెద్దగా టాస్కులు ఆడి గెలవకపోయినా కూడా చీఫ్ గా ఎంపిక అయ్యింది. నిఖిల్ మరియు నైనికా తీసుకున్న ఈ నిర్ణయం పై హౌస్ లో చిన్నపాటి గొడవ కూడా జరిగింది. అయితే యష్మీ తనకి వచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని చెయ్యి జారకుండా జాగ్రత్తగా ఆడడంలో సఫలం అయ్యిందనే చెప్పాలి. తెలివిగా ఆమె తీసుకున్న నిర్ణయాల కారణంగా నేడు హౌస్ లో అందరికంటే ఉన్నతమైన స్థానాన్ని అనుభవించే అదృష్టం దక్కింది. యష్మీ క్లాన్ కి కావాల్సిన సైన్యాన్ని ఎంచుకోవాల్సిందిగా బిగ్ బాస్ కోరగా, యష్మీ చాలా తెలివితేటలు ప్రదర్శించి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని తన టీం లోకి తీసుకుంది. నైనికా టీం యష్మీ టీం అంతటి స్ట్రాంగ్ కాకపోయినా కూడా పోటీ ని ఇవ్వగలిగే టీం గా చెప్పుకోవచ్చు. కానీ చివరికి అన్యాయానికి గురైంది మాత్రమే నిఖిలే.

    యష్మీ ని చీఫ్ గా చేసేందుకు నిఖిల్ అనేక మంది కంటెస్టెంట్స్ తో గొడవలు కూడా పడ్డాడు. కానీ చివరికి అతనికే టీం లేకుండా పోయింది. యష్మీ మరియు నైనికా టీం లో చెరో నలుగురు కంటెస్టెంట్స్ ఉండగా, నిఖిల్ టీం లో కేవలం ముగ్గురు మాత్రమే మిగిలారు. ఉన్న మూడు టీమ్స్ లో నిఖిల్ టీం చిన్నది అవ్వడం తో, యష్మీ మరియు నైనికా టీం లకు పోటీ పెట్టి అత్యధిక టాస్కులు గెలిచిన టీం కి నిఖిల్ టీం నుండి ఒకరిని ఎంచుకునే అవకాశం కల్పించాడు బిగ్ బాస్. యష్మీ టీం అత్యధిక టాస్కులు గెలిచి నిఖిల్ టీం నుండి సోనియా ని సెలెక్ట్ చేసుకున్నారు. హౌస్ లో ఉన్న మూడు టీమ్స్ కంటే యష్మీ టీం పెద్దది కావడంతో పూర్తి స్థాయి ఆధిపత్యం ఆ టీం సొంతమైంది.

    బిగ్ బాస్ చీఫ్స్ ముగ్గురిని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి, ఎక్కువ మంది సభ్యులు ఉన్న యష్మీ టీం ని మినహాయిస్తూ మిగిలిన వారికి ఇంటి పనులు అప్పజెప్పే బాధ్యతని యష్మీ కి ఇస్తాడు బిగ్ బాస్. యష్మీ కుకింగ్ డిపార్ట్మెంట్ కి నిఖిల్ టీం ని కేటాయించగా, క్లీనింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన పనులు మొత్తం నైనికా టీం కి కేటాయించింది. ఇది చూసేందుకు అన్యాయంగా అనిపించినప్పటికీ బిగ్ బాస్ తీసుకున్న నిర్ణయం కాబట్టి అందులో యష్మీ తప్పు ఏమి లేదనే చెప్పొచ్చు. ఏది ఏమైనా నిఖిల్ కారణంగా లక్ తో చీఫ్ అయిన యష్మీ ఈరోజు అతనినే తొక్కేసిందని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో యష్మీ ఎలాంటి అన్యాయం చేయలేదని, తనకి వచ్చిన అవకాశాన్ని సరైన పద్దతిలో ఉపయోగించుకుంటుంది అని అంటున్నారు నెటిజెన్స్.