Virata Parvam First Review: విభిన్నమైన పాత్రలతో రొటీన్ కి బిన్నంగా సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కుని ఏర్పర్చుకున్న హీరో దగ్గుపాటి రానా..చాలా కాలం తర్వాత ఆయన హీరో గా నటించిన సినిమా విరాట పర్వం ఎట్టకేలకు ఈ నెల 17 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది..వేణు ఉడుగుల దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా లో సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దగ్గుపాటి సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు..ఇటీవల కాలం లో ఈయన నిర్మించిన నారప్ప మరియు దృశ్యం పార్ట్ 2 వంటి సినిమాలు OTT లోనే విడుదల అయ్యాయి..చాలా కాలం తర్వాత ఆయన నిర్మాణ సారథ్యం లో థియేటర్స్ లో విడుదల అవుతున్న సినిమా ఇదే..టీజర్ మరియు ట్రైలర్స్ తో ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించాయి.గత ఏడాది ఏప్రిల్ 17 వ తారీఖున విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కరోనా కేసులు పెరుగుతున్న కారణం గా వాయిదా పడింది..ఆ తర్వాత ఈ సినిమా డైరెక్ట్ OTT లో విడుదల చేసేందుకు సురేష్ బాబు కి భారీ మొత్తం లో ఆఫర్లు కూడా వచ్చాయి..కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ పరంగా అద్భుతమైన రెవిన్యూ సాధించే సినిమా అని సురేష్ బాబు కి గట్టి నమ్మకం ఉండడం తో OTT కి ఇవ్వకుండా థియేటర్స్ లోనే విడుదల చెయ్యడానికి ఆసక్తిని చూపాడు..ఇది ఇలా ఉండగా ఇటీవలే ఈ సినిమా ని కొంతమంది టాలీవుడ్ సెలెబ్రెటీలకు స్పెషల్ స్క్రీనింగ్ వేశారు..ఒకసారి ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు మనం చూడబోతున్నాం.
Also Read: Young woman dance viral: బోనాల జాతర..మాస్ డ్యాన్స్ తో యువతి ఊపేసింది.. వైరల్ వీడియో
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే 1990 వ సంవత్సరం లో తెలంగాణ లో చోటు చేసుకున్న నక్సలైట్ ఉద్యమం ని ఆధారంగా తీసుకొని వేణు ఉడుగుల ఈ సినిమాని తెరకెక్కించాడు..ఈ చిత్రం లో రానా మరియు సాయి పల్లవి ఇద్దరు కూడా నక్సలైట్స్ గా కనిపిస్తారు..వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న ఎమోషన్స్ ని భావోద్వేగాలను డైరెక్టర్ వేణు ఉడుగుల ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడట..సాయి పల్లవి మరోసారి తన అద్భుతమైన నటన తో ప్రేక్షుకులను కంటతడి పెట్టించేలా చేసిందట ఈ సినిమా తో.ముఖ్యంగా పతాక సన్నివేశం లో హీరో హీరోయిన్ ఇద్దరు చనిపోతారట..ఈ సన్నివేశం ని వేణు ఉడుగుల ప్రేక్షకులకు పదికాలాల పాటు గుర్తుండిపోయ్యేలా తెరకెక్కించాడట..నేనే రాజు నేనే మంత్రి సినిమా తర్వాత పూర్తి స్థాయి కథానాయకుడిగా రానా నటించిన ఈ చిత్రం ఆయన కెరీర్ లో ఒక్క మైలు రాయిగా నిలిచిపోనుందట..ఈ సినిమాని చూసిన సెలెబ్రిటీలు ట్విట్టర్ లో పోస్ట్ చేసిన పోస్టులు చూస్తుంటే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచేలా చేస్తున్నాయి..ముఖ్యంగా DJ టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమాని చూసి వేసిన కొన్ని ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి..ప్రివ్యూ షో నుండి అద్భుతమైన టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఇక రేపు విడుదల తర్వాత ఎలాంటి రెస్పాన్స్ ని దక్కించుకుంటుందో చూడాలి.
Also Read: Sudigali Sudheer- Sreemukhi and Anasuya: అనసూయతో, శ్రీముఖి తో కొత్త షోస్ చేస్తున్న సుధీర్… రష్మీ ని ఎందుకు వదిలేసినట్లు ?
Recommended Videos: