Gopichand- Director Teja: సినిమా పరిశ్రమలో అద్భుతాలు జరుగుతుంటాయి. హీరో అవ్వాలనుకున్న వారు విలన్ గా విలన్ గా చేయాలనుకునే వారు హీరోగా మారే అవకాశాలు లేకపోలేదు. అందరు మొదట విలన్ గా అవతారమెత్తి తరువాత హీరోగా అయిన వారు ఉన్నారు. కానీ ఇక్కడ ఓ హీరో మాత్రం మొదట కథానాయకుడిగా పరిచయం అయి తరువాత విలన్ గా మారి అటు పిమ్మట హీరోగా మారిన ఉదంతం తెలిసిందే. ఇలాంటి ఘటనలు అరుదుగానే జరుగుతాయి. టి. కృష్ణ తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన గోపిచంద్ మొదట తొలివలపు సినిమాతో తెరంగేట్రం చేసినా ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో అవకాశాలు దొరకలేదు. దీంతో విలన్ పాత్రలు చేయడానికి కూడా సిద్ధమయ్యరు.
దీంతో నితిన్ హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాలో గోపిచంద్ విలన్ గా నటించాడు. అందులో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో తరువాత నిజం, వర్షం సినిమాల్లో కూడా విలన్ గా అవతారమెత్తి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. హీరోగా కంటే విలన్ గానే ఎక్కువ మార్కులు సంపాదించుకోవడం విశేషం. దీంతో గోపిచంద్ విలన్ పాత్రలకే పరిమితం అనుకున్నారు. కానీ ఆయనలోని ప్రతిభ మళ్లీ బయటకొచ్చి హీరో అవకాశాలు అందిపుచ్చుకుని ప్రస్తుతం యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకుంటున్నారు. గతంలో యాక్షన్ సినిమాలకు అర్జున్ పెట్టింది పేరు. ఇప్పుడు మాత్రం గోపిచంద్ తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.
Also Read: Virata Parvam First Review: విరాట పర్వం మూవీ మొట్టమొదటి రివ్యూ
జయం సినిమాలో గోపిచంద్ పారితోషికం వింటే ఆశ్చర్యపోతారు. అప్పట్లో ఆయనకు తేజ ఇచ్చిన రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకవుతారు. రూ.11 వేలేనట. విలన్ క్యారెక్టర్ కు మరీ అంత తక్కువ పారితోషికమా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తేజ గోపిచంద్ ను మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కొంచెం ఎక్కువ ఇచ్చి ఉండాల్సిందని చెబుతున్నారు. ఇప్పుడు మారుతి దర్శకత్వంలో వస్తున్న పక్క కమర్షియల్ సినిమాకు రూ.8 కోట్లు తీసుకుంటున్నాడు. అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉంది. తేజ గోపిచంద్ కు అన్యాయం చేశారనే వాదన కూడా ఉంది. కానీ మొత్తానికి చలన చిత్ర రంగంలో వింతలు జరుగుతుంటాయి. అందులో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం.
ఓడలు బండ్లవుతాయి బండ్లు ఓడలవాతయంటే గోపిచంద్ జీవితమే నిదర్శనం. మొదట హీరోగా తరువాత విలన్ గా మళ్లీ హీరోగా మారి తన టాలెంట్ తో ఎదిగిన కథానాయకుడు. తెలుగులో యాక్షన్ సినిమాలు చేయాలంటే గోపిచంద్ ఒక్కరే ఉండటంతో ఏ నిర్మాత అయినా ఆయన గడప తొక్కాల్సిందే. ఆయనతో సినిమా చేయాల్సిందే. జీవితమంటేనే సినిమాలాగా గోపిచంద్ భవితవ్యం కూడా పలు మలుపులు తిరిగి హీరోగానే కొనసాగుతోంది. భవిష్యత్ లో మరిన్ని విజయాలు సొంతం చేసుకుని గోపిచంద్ తనదైన మార్కును చూపించుకోవాలని ప్రేక్షకులు ఆకాంక్షిస్తున్నారు.