Nithya Menen: హీరోయిన్ నిత్యా మీనన్ సడన్ గా స్కూల్ టీచర్ అవతారం ఎత్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు చెప్పారు. సదరు వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ గా మారింది. నిత్యా మీనన్ చాలా సరదాగా ఉంటారు. షూటింగ్స్ సెట్స్ లో అందరితో కలిసిపోయి అల్లరి చేస్తారు. ఇక షూటింగ్ కోసం పలు ప్రదేశాలను సందర్శించే నిత్య స్థానిక జనాలతో కలిసిపోతారని సమాచారం. తాజాగా ఆమె స్కూల్ పిల్లలకు పాఠాలు చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిత్యా మీనన్ లేటెస్ట్ మూవీ షూట్ ఏపీలో జరుగుతుంది. షాట్ గ్యాప్ లో నిత్యా పక్కనే ఉన్న గవర్నమెంట్ స్కూల్ ని సందర్శించారు.

ఒక క్లాస్ రూమ్ కి వెళ్లిన పిల్లలకు ఇంగ్లీష్ పాఠాలు చెప్పారు. స్టోరీ చదివి స్టూడెంట్స్ కి అర్థమయ్యేలా చెప్పారు. ఈ వీడియోను నిత్యా మీనన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. నా కొత్త సంవత్సరం రోజు ఇలా గడిచింది. కృష్ణాపురం గ్రామంలోని స్కూల్ చిల్డ్రన్స్ ని కలవడం, వారితో మాట్లాడటం, పాఠాలు చెప్పడం గొప్ప అనుభూతిని పంచిందంటూ… కామెంట్ చేసింది. నిత్యా మీనన్ పాఠాలు చెబుతున్న వీడియో వైరల్ కావడంతో నెటిజెన్స్ స్పందిస్తున్నారు. ఆమెను పలువురు అభినందిస్తున్నారు. నిత్యామీనన్ సింప్లిసిటీ ని మెచ్చుకుంటున్నారు.
కాగా తెలుగులో నిత్యా మీనన్ చివరిసారిగా భీమ్లా నాయక్ మూవీలో కనిపించారు. ఆ చిత్రంలో పవన్ కళ్యాణ్ భార్య రోల్ చేశారు. రెబల్ వుమన్ గా భీమ్లా నాయక్ లో నిత్యా మీనన్ రోల్ ఆకట్టుకుంది. భీమ్లా నాయక్ సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఆమె డిజిటల్ సిరీస్లు ఎక్కువగా చేస్తున్నారు. ఇటీవల ఆమె నటించిన వండర్ ఉమెన్ మూవీ నేరుగా ఓటీటీలో విడుదలైంది. సోని లివ్ ఒరిజినల్ మూవీగా తెరకెక్కిన వండర్ ఉమెన్ అక్కడ స్ట్రీమ్ అవుతుంది.

వండర్ ఉమెన్ మూవీలో నిత్యా మీనన్ గర్భవతిగా నటించారు. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం నిత్యా ప్రెగ్నెంట్ లేడీ గెటప్ లో ఫోటోలు షేర్ చేశారు. పెళ్లి కాకుండానే తల్లినయ్యానన్న నిత్యా మీనన్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ సంచలనం రేపాయి. అలా మొదలైంది, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రాల్లో నిత్యా మీనన్ నటన ప్రేక్షకులను మెప్పించింది. ఆ మధ్య నిత్యా మీనన్ విపరీతంగా బరువు పెరిగారు. ఆ సమయంలో ఆమె ట్రోల్స్ కి గురయ్యారు.
https://www.youtube.com/watch?v=MfzB0pnUHe4