Gandivdhari Arjuna: ప్రయోగాత్మక చిత్రాలకు వరుణ్ తేజ్ పెట్టింది పేరు. కెరీర్ బిగినింగ్ నుండి ఆయన వైరుధ్యంతో కూడా సబ్జెక్ట్స్ ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా హీరోలు మాస్ ఇమేజ్ తెచ్చే కమర్షియల్ సబ్జెక్ట్స్ కోరుకుంటారు. కానీ వరుణ్ సాహసోపేతమైన రూట్ ఎంచుకున్నారు. కంచె, ఫిదా, అంతరిక్షం, గద్దలకొండ గణేష్ వరుణ్ చేసిన ప్రయోగాత్మక చిత్రాలుగా చెప్పొచ్చు. వీటిలో కొన్ని ఫలితం ఇస్తే మరికొన్ని నిరాశపరిచాయి. వరుణ్ గత చిత్రం ‘గని’ స్పోర్ట్ డ్రామాగా తెరకెక్కింది. వరుణ్ తేజ్ బాక్సర్ రోల్ చేశారు. దీని కోసం ఆయన పూర్తిగా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ సాధించారు. ప్రొఫెషనల్స్ వద్ద స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు.

ఎమోషనల్ గా మూవీ కనెక్ట్ కాకపోవడంతో గని ఫలితం ఇవ్వలేదు. ఇక బిగ్ డిజాస్టర్ తర్వాత ఫార్మ్ లో లేని దర్శకుడికి వరుణ్ ఆఫర్ ఇచ్చి ప్రత్యేకత చాటుకున్నారు. అలాగే రెగ్యులర్ మూవీ కాకుండా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ ట్రై చేస్తున్నారు. గరుడవేగ మూవీతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన ప్రవీణ్ సత్తారు నాగార్జునతో అదే జోనర్లో ది ఘోస్ట్ తెరకెక్కించారు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ది ఘోస్ట్ కమర్షియల్ గా ఆడలేదు.
తనకు పట్టున్న సేమ్ జోనర్లోనే వరుణ్ తేజ్ తో మూవీ చేయడం చర్చకు దారితీసింది. వరుణ్ 12వ చిత్రంగా తెరకెక్కుతున్న మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. మోషన్ పోస్టర్ సైతం విడుదల చేయగా మూవీ ఎలా ఉండబోతుందనే ఓ అవగాహన వచ్చింది. ఇది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్. దేశ ఆంతరంగిక లేక బాహ్య రక్షణకు సంబంధించిన సబ్జెక్టుతో తెరకెక్కుతుంది. వరుణ్ ఆ రక్షణ బాధ్యతలు తీసుకున్న ఆఫీసర్ గా కనిపించే అవకాశం కలదు.

వరుణ్ స్పై, రా ఏజెంట్, ఇంటర్పోల్ ఆఫీసర్, సీబీఐ ఇలా కీలక ఆఫీసర్ గా కనిపించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక టైటిల్ బాగా ఆకర్షించింది. ఒక యాక్షన్ సబ్జెక్టుకి క్లాసిక్ టైటిల్ పెట్టారు. టైటిల్ క్లాసిక్ అయినా దాని అర్థం మాత్రం యుద్దాన్ని గుర్తు చేస్తుంది. ‘గాండీవధారి అర్జున’ అంటే ఆయుధం చేపట్టిన అర్జునుడని భావం. అర్జునుడు ఆయుధం పేరు గాండీవం. పోస్టర్ లో ‘శాంతిభద్రలు కాపాడటం అతిపెద్ద బాధ్యత’ అనే కోట్ చూడవచ్చు. ఇవన్నీ డీకోడ్ చేస్తే… దేశాన్ని కాపాడేందుకు ఆయుధం పట్టిన హీరో కథే ‘గాండీవధారి అర్జున’ మూవీ. కాగా హీరోయిన్ ని ప్రకటించాల్సి ఉంది. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా ఉన్నారు.
Here's the Title & First Look Motion Poster of
Mega Prince @IAmVarunTej's #VT12 – #GandeevadhariArjuna 🔥Exciting Updates rolling out soon 💥💥#HBDVarunTej ❤🔥@PraveenSattaru @MickeyJMeyer @BvsnP @SVCCofficial pic.twitter.com/FiZZZTXrPW
— SVCC (@SVCCofficial) January 19, 2023