https://oktelugu.com/

వైరల్: కొడుకు కోరిక తీర్చలేక ఏడ్చేసిన అనసూయ..!

యాంకర్ అనసూయ ఇద్దరు బిడ్డల తల్లైనా.. గ్లామర్ విషయంలో మాత్రం ఎక్కడా రాజీపడదు. వెండితెరపై గ్లామర్ షోకు హద్దులు గీసుకున్న అనసూయ.. బుల్లితెరపై మాత్రం కావాల్సిన గ్లామర్ షో చేస్తూ కుర్రకారును ఆకట్టుకుంటోంది. అనసూయ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన సినిమాలు.. షోలకు సంబంధించి అప్డేట్స్ ఇస్తుంటోంది. వీటితోపాటు తన పర్సనల్ విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో లైవ్ లోకి వచ్చి అభిమానులతో ఇంట్రాక్ట్ అవుతూ సమాజంలోని సమస్యలపై స్పందిస్తూ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 19, 2020 / 03:37 PM IST
    Follow us on

    యాంకర్ అనసూయ ఇద్దరు బిడ్డల తల్లైనా.. గ్లామర్ విషయంలో మాత్రం ఎక్కడా రాజీపడదు. వెండితెరపై గ్లామర్ షోకు హద్దులు గీసుకున్న అనసూయ.. బుల్లితెరపై మాత్రం కావాల్సిన గ్లామర్ షో చేస్తూ కుర్రకారును ఆకట్టుకుంటోంది.

    అనసూయ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన సినిమాలు.. షోలకు సంబంధించి అప్డేట్స్ ఇస్తుంటోంది. వీటితోపాటు తన పర్సనల్ విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో లైవ్ లోకి వచ్చి అభిమానులతో ఇంట్రాక్ట్ అవుతూ సమాజంలోని సమస్యలపై స్పందిస్తూ ఉంటోంది.

    అనసూయ తన పర్సనల్ విషయాలతోపాటు సమాజంలోని సమస్యలపై తన అభిప్రాయాన్ని కుండబద్ధలుకొట్టినట్లు చెప్పేస్తూ ఉంటోంది. ఈ విషయంపై తనపై ఎలాంటి నెగిటివ్స్ కామెంట్స్ వచ్చిన అనసూయ పెద్దగా పట్టించుకోలేదు. అయితే కొన్నిసార్లు నెగిటివ్ కామెంట్ చేసేవారిపై అనసూయ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిని తన అకౌంట్ నుంచి డిలీట్ చేసి సందర్భాలున్నాయి.

    తాజాగా అనసూయ తన కుమారుడితో మాట్లాడిన ఓ సంభాషణను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ‘అమ్మా.. నేను గడిచిన కాలానికి వెళ్లాలనుకుంటున్నాను.. ఎందుకంటే అప్పుడు కరోనా లేదు.. వరదల్లేవు.. అవన్నీ నాకు ఎంతో సంతోషాన్ని అందించిన రోజులు’ అంటూ తన తొమ్మిదేళ్ల కుమారుడు చెప్పాడట. ఈ మాటలు వినగానే తాను కన్నీటి పర్యంతమైనట్లు చెప్పింది.

    తన కుమారుడి మాటలు తనకెంతో బాధ కలిగించినట్లు అనసూయ వాపోయింది. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం.. రాబోయే తరాల వారికి మనం ఏం అందించనున్నాం.. అంటూ వ్యాఖ్యానించింది. తనకు కూడా ఫ్యామిలీ, స్నేహితులతో గతంలో మంచి అనుభూతులు ఉన్నాయని గుర్తు చేసుకుంది.

    అయితే తన కుమారుడు కోరుకుంటున్నట్లు గడిచిన కాలం తీసుకురాలేనంటూ అనసూయ వాపోయింది. గడిచిన కాలం తిరిగి రాదని.. భవిష్యత్ ను అంచనా వేయలేమని అనసూయ అంటోంది. రానున్న తరాలకు మాత్రం మనం మంచి భవిష్యత్ అందించాలంటూ అనసూయ విజ్ఞప్తి చేస్తోంది. ప్రస్తుతం అనసూయ ‘ఆచార్య’ మూవీలో ఓ స్పెషల్ రోల్ చేస్తోంది.