harish rao
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్‌లో కేంద్ర ప్రభుత్వం రూ.1600 ఇస్తుందని బీజేపీ ప్రచారం చేస్తోందని అలా నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి హరీశ్‌రావు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి సవాల్ విసిరారు. అలా నిరూపించకపోతే తాను ఎంపీ పదవికి రాజీనామా చేయాలని అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అవాస్తవలు చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటోందని, టీఆర్‌ఎస్ ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తుందన్నారు.