Sampath Raj about Mahesh Babu: తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు సంపత్ రాజ్(Sampath Raj). టాలీవుడ్ లో దాదాపుగా ఆయన సీనియర్ హీరోల దగ్గర నుండి, స్టార్ హీరోల వరకు అందరితో కలిసి పని చేసాడు. ఇప్పటికీ మంచి పాత్రలు ఆయనకు దక్కుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆయన గొంతు లోని గాంభీర్యం కి ఫ్యాన్స్ కానీ వారంటూ ఎవ్వరూ ఉండరు. తెలుగు లో ‘పంజా’ సినిమాతో మొదలైన సంపత్ నంది ప్రస్థానం, ‘మిర్చి’ చిత్రం తో తారా స్థాయికి చేరింది. ఆ సినిమా నుండి ఇప్పటి వరకు సంపత్ కి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అయితే కొంతకాలం క్రితం ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడిన కొన్ని మాటలు చాలా బోల్డ్ గా, నిర్మొహమాటంగా ఉన్నాయి.
ముఖ్యంగా ఇలాంటి క్యారక్టర్ ఆర్టిస్టులు అందరి హీరోలతో కలిసి పని చెయ్యాలి కాబట్టి, స్పష్టంగా నాకు ఆ హీరో నటన అంటే ఇష్టం, ఇండియా లో అతన్ని మించిన హీరో ఎవ్వరూ లేరు అని చెప్పలేరు. కానీ సంపత్ రాజ్ మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu) నటన ని ప్రశంసిస్తూ గతంలో చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘మహేష్ బాబు లాగా సహజంగా నటించే హీరో ని ఇండియా లో నేను ఎక్కడా చూడలేదు. సాధారణంగా మనం కూర్చొని మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో, మహేష్ బాబు నటన కూడా అంత సహజం గా ఉంటుంది. బయట ఎవ్వరూ కూడా ఓవర్ డ్రామాలు చేస్తూ, భయంకరమైన ఎక్స్ ప్రెషన్స్ పెట్టరు కదా. మహేష్ బాబు కి అలాంటి నటన అంటే ఇష్టం ఉండదు. ఆయన సహజమైన నటనకు అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, ఆరా, స్టైల్ తోడు అవ్వడం తో, వెండితెర మీద చూసేందుకు ఆయన నటన ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు సంపత్ రాజ్.
ఇకపోతే సంపత్ రాజ్ రీసెంట్ గానే సంక్రాంతి కానుకగా విడుదలైన ‘నారీ నారీ నడుమ మురారి’ అనే సూపర్ హిట్ చిత్రం లో కీలక పాత్ర పోషించాడు. రాబోయే రోజుల్లో ఆయన నుండి మరిన్ని సినిమాలు రానున్నాయి. అయితే ఒకప్పుడు సంపత్ రాజ్ ఏడాదికి 20 సినిమాలు చేసేవాడు. కానీ ఈమధ్య కాలం లో సినిమాల సంఖ్య కాస్త తగ్గించాడు. గత ఏడాది తెలుగు, తమిళ్, కన్నడ మరియు మలయాళం భాషలకు కలిపి కేవలం ఆరు సినిమాల్లో మాత్రమే నటించాడు. ఈ ఏడాది ఎన్ని సినిమాల్లో నటిస్తాడో చూడాలి.