Brahmaji comments on Raviteja: ఇండస్ట్రీ లో రెండు దశాబ్దాల పైగా అనుభవంతో ఇప్పటికీ మంచి డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులలో ఒకరు బ్రహ్మాజీ(Bramhaji). ఇప్పుడైతే ఈయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నాడు కానీ, ఆరోజుల్లో మాత్రం ఈయన కొన్ని సినిమాల్లో హీరో గా కూడా నటించాడు. అందులో ‘సింధూరం’ అనే చిత్రం కూడా ఉంది. కృష్ణ వంశీ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాలో బ్రహ్మాజీ హీరో గా నటించగా, మాస్ మహారాజ రవితేజ ఒక కీలక పాత్ర పోషించాడు. ‘హాయ్ రే హాయ్..జామ్ పండు రోయ్’ అంటూ రవితేజ చిందులేసే పాట ఒకటి గుర్తుంది కదా?, ఆ పాట ఈ చిత్రం లోనిదే. ఆ రోజుల్లో ఈ పాట ఒక సెన్సేషన్. అంతకు ముందు రవితేజ అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసాడు. కానీ అప్పుడు రానంత గుర్తింపు, ఈ పాట తోనే వచ్చింది.
ఈ సినిమా తర్వాత రవితేజ కి మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. బ్రహ్మాజీ కి కూడా ఈ సినిమా ఆరోజుల్లో తన కెరీర్ కి మంచి బ్రేక్ ఇచ్చింది. అయితే కాలం ఎంత విచిత్రమైనదో చూడండి. బ్రహ్మాజీ హీరో గా చేసిన సినిమాలో క్యారెక్టర్ రోల్ ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న రవితేజ, భవిష్యత్తులో హీరో గా స్థిరపడి పెద్ద సూపర్ స్టార్ అయ్యాడు, ఆ తర్వాత రవితేజ హీరో గా నటించిన ఎన్నో సినిమాల్లో బ్రహ్మాజీ క్యారెక్టర్ రోల్స్ చేసాడు. గతం లో ఒక ఇంటర్వ్యూ లో రిపోర్టర్ కూడా బ్రహ్మాజీ ని ఇదే ప్రశ్న అడుగుతాడు. ‘మీ ఇద్దరి కెరీర్ దాదాపుగా ఒకే సమయం లో మొదలైంది. మీరు హీరో గా నటించిన సింధూరం చిత్రం లో రవితేజ క్యారెక్టర్ రోల్ చేసాడు. అలాంటిది ఆయన ఇప్పుడు మీ కంటే ముందుకు వెళ్ళిపోయి, హీరో గా సూపర్ స్టార్ అయ్యాడు , మీరేమో ఆయన వెనుక ఉన్నారు, దీనికి ఏమి సమాధానం చెప్తారు?’ అని అడుగుతాడు.
దీనికి బ్రహ్మజీ సమాధానం చెప్తూ ‘ఇప్పుడు మీతో పాటు చాలా మంది టీవీ చానెల్స్ ని ప్రారంభించారు. వారిలో మీకంటే టాప్ లో కొందరు ఉండే ఉంటారు కదా?, నా పరిస్థితి కూడా అదే. నటుడిగా రవితేజ కంటే పెద్ద స్థాయిలో ఉండాలని నాకు కూడా ఉంటుంది. అలా లేదంటే అబద్దం చెప్పినట్టే, కానీ నాకు ఇంత వరకే రాసి పెట్టి ఉంది. అయితే రవితేజ నాకు పోటీ ఏంటి?, అతను హీరో, నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ . హీరోల క్యాటగిరీలో ఆయన ఎంత సక్సెస్ అయ్యాడో, నేను క్యారక్టర్ ఆర్టిస్టుల క్యాటగిరీ లో అలాగే సక్సెస్ అయ్యాను’ అంటూ చెప్పుకొచ్చాడు బ్రహ్మాజీ. ఆయన మాట్లాడిన మాటలను మీరు ఈ క్రింది వీడియో లో చూడొచ్చు.