Homeఎంటర్టైన్మెంట్Kamal Haasan : ఆ స్టార్ హీరో కన్న కూతురితో కూడా రొమాన్స్ చేయగలడు... సంచలనం...

Kamal Haasan : ఆ స్టార్ హీరో కన్న కూతురితో కూడా రొమాన్స్ చేయగలడు… సంచలనం రేపుతున్న సుమన్ కామెంట్స్!

Kamal Haasan : టాలీవుడ్ సీనియర్ నటుల్లో సుమన్ ఒకరు. ప్రస్తుతం ఆయన క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. ప్రతినాయకుడు పాత్రల్లో కూడా మెప్పిస్తున్నారు. అన్నమయ్యలో సుమన్ చేసిన వెంకటేశ్వర స్వామి పాత్ర ఐకానిక్ గా నిలిచింది. అయితే సుమన్ కెరీర్ హీరోగా మొదలైంది. ఒక దశలో తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోగా వెలిగాడు. అనుకోని పరిణామంతో సుమన్ కెరీర్ నాశనం అయ్యింది.

సుమన్ అసభ్య వీడియోల కేసులో ఇరుక్కున్నారు. ఆయన కొన్నాళ్ల పాటు జైలు జీవితం అనుభవించారు. ఈ ఘటన తర్వాత సుమన్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది. హీరోగా చిత్రాలు చేసినప్పటికీ స్టార్ గా వెలుగొందే ఛాన్స్ కోల్పోయాడు. ఈ విషయంలో తరచుగా బాధపడుతూ ఉంటాడు సుమన్. సౌత్ లో చిరంజీవి, రజినీకాంత్, కమల్ హాసన్ దాదాపు ఒకే సమయంలో ఇండస్ట్రీలో ఎదిగారు. సుమన్ కూడా ఇదే కాలంలో హవా సాగించాడు.

తాజా ఇంటర్వ్యూలో సుమన్ తాను పరిశ్రమకు వచ్చిన కొత్తల్లో ఎవరు స్టార్స్? కమల్ హాసన్, రజినీకాంత్ లకు ఎలాంటి ఇమేజ్ ఉండేది? చెప్పుకొచ్చాడు. సుమన్ మాట్లాడుతూ.. అప్పట్లో కోలీవుడ్ ని ఎంజీఆర్, శివాజీ గణేశన్ ఏలేవారని అన్నారు. ఎంజీఆర్ యాక్షన్ హీరో. డాన్సులు, ఫైట్స్ కి పాప్యులర్. శివాజీ గణేశన్ మాత్రం మంచి నటుడు. వీరి తర్వాత 78-79లలో రజినీకాంత్, కమల్ హాసన్ వచ్చారు.

రజినీకాంత్ ఓన్లీ స్టైల్. సిగరెట్ ఫ్లిప్ చేయడం, స్పీడ్ గా నడవడం ఇలా ఒక ట్రెండ్ సెట్ చేశాడు. ఇక కమల్ హాసన్ రొమాంటిక్ హీరో. ఆయన ఫ్యాషన్ ని అప్పట్లో యూత్ ఫాలో అయ్యేది. ముంబై నుండి బట్టలు తెప్పించి ఆయన డ్రెస్సింగ్ విషయంలో ప్రేక్షకులను ఆకట్టుకునేవాడు. కమల్ హాసన్ సిల్వర్ స్క్రీన్ పై రొమాన్స్ చేస్తుంటే చాలా సహజంగా ఉంటుంది. నటించిన భావన కలదు. మన కళ్ళ ముందు జరుగుతుంది అన్నట్లు ఉంటుంది.

కమల్ హాసన్ డీగ్లామర్ రోల్స్ కూడా చేశాడు. నాయకుడు మూవీలో పొట్ట, బట్టతలో కనిపించారు. సినిమా కోసం గుండు చేయించుకున్నాడు. గడ్డం పెంచాడు. దశావతారం మూవీలో ఆయన చేసిన పాత్రల గురించి ఎంత చెప్పినా తక్కువే. భారతీయుడు చిత్రంలో ఓల్డ్ గెటప్ కోసం హాలీవుడ్ నుండి మేకప్ ఆర్టిస్ట్ వచ్చాడు. ఆ మేకప్ ఎక్కువ సేపు ఉండదు. చెమట పడితే ఊడిపోతుంది. అందుకే కమల్ హాసన్ రెస్ట్ లేకుండా తన సీన్స్ పూర్తి చేసేవాడు.

డీ గ్లామర్ రోల్ చేయాలంటే మాలాంటి హీరోలు భయపడేవారు. ఫ్యాన్స్ కి నచ్చదని, అనేక కారణాలతో సాహసించే వాళ్ళం కాదు. కానీ కమల్ హాసన్ చేశారు. నటన అనేది ఆయనకు గాడ్ గిఫ్ట్. కూతురు శృతి హాసన్ తో కూడా ఆయన రొమాంటిక్ సీన్ చేయగలడని సుమన్ చెప్పుకొచ్చారు.

కాగా కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి శృతి హాసన్ స్టార్ హీరోయిన్ అయ్యారు. తండ్రి వలె ఆమె కూడా మల్టీ టాలెంటెడ్. కమల్ హాసన్ రచయిత, డైరెక్టర్, సింగర్ కూడాను. శృతి హాసన్ ప్రొఫెషనల్ సింగర్. మ్యూజిక్ కూడా కంపోజ్ చేస్తుంది. లిరిక్స్ రాయగలదు. కెరీర్ బిగినింగ్ లోనే శృతి హాసన్ బోల్డ్ రోల్స్ చేయడం కొసమెరుపు. ప్రస్తుతం శృతి హాసన్ తెలుగులో డెకాయిట్ మూవీ చేస్తుంది. సలార్ 2 కూడా ఆమె చేతిలో ఉంది.

Actor Suman Shocking Comments On Kamal Haasan | Bharateeyudu2 | Anchor Prasanna   @Ananthatvnews

 

Exit mobile version