https://oktelugu.com/

విజయ్ – మురుగదాస్‌ నాలుగోసారి..

కోలీవుడ్‌ సూపర్ స్టార్ విజయ్‌కు సౌతిండియాలో మంచి స్టార్డమ్‌ ఉంది. తమిళ్‌తో పాటు కన్నడ, తెలుగులో కూడా ఆయనకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులో డబ్‌ అవుతోంది. ఈ మధ్య నేరుగా రిలీజ్‌ అవుతున్నాయి. తెలుగు స్టార్లను తలదన్నే రీతిలో విజయ్ సినిమాలకు టాలీవుడ్‌లో భారీ ఓపెనింగ్స్‌ వస్తున్నాయి. తన ప్రతి సినిమాలో ఏదో ఒక సోషల్‌ మెసేజ్ ఉండేలా చూసుకుంటాడు విజయ్. రాజకీయాలపై కూడా ఆయనకు ఆసక్తి ఉండడమే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 20, 2020 4:21 pm
    Follow us on


    కోలీవుడ్‌ సూపర్ స్టార్ విజయ్‌కు సౌతిండియాలో మంచి స్టార్డమ్‌ ఉంది. తమిళ్‌తో పాటు కన్నడ, తెలుగులో కూడా ఆయనకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులో డబ్‌ అవుతోంది. ఈ మధ్య నేరుగా రిలీజ్‌ అవుతున్నాయి. తెలుగు స్టార్లను తలదన్నే రీతిలో విజయ్ సినిమాలకు టాలీవుడ్‌లో భారీ ఓపెనింగ్స్‌ వస్తున్నాయి. తన ప్రతి సినిమాలో ఏదో ఒక సోషల్‌ మెసేజ్ ఉండేలా చూసుకుంటాడు విజయ్. రాజకీయాలపై కూడా ఆయనకు ఆసక్తి ఉండడమే అందుకు కారణం. ముఖ్యంగా స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్‌తో పని చేస్తే కచ్చితంగా సమాజాన్ని ప్రభావితం చేసే ఒక సందేశం ఉండాలని కోరుకుంటాడు విజయ్‌. వీళ్లిద్దరిదీ సక్సెస్‌ఫుల్‌ జోడీ. వీళ్ల కలయికలో గతంలో వచ్చిన తుపాకి, కత్తి, సర్కార్ వంటి చిత్రాలు బ్లాక్ ‌బస్టర్స్‌గా నిలిచాయి. ఇప్పుడు విజయ్‌- మురుగదాస్‌ కలయికలో నాలుగో సినిమా ఫిక్సయిందని సమాచారం. సన్‌ పిక్చర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. విజయ్ సరసన మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్‌. తమన్‌ మ్యూజిక్‌ అందించనుండగా.. సంతోష్‌ శివన్‌ సినిమాటోగ్రాఫ్‌గా వ్యవహరిస్తారు.

    Also Read:  నాని హిట్ అయితేనే.. మిగతా హీరోలకు మార్కెట్ !

    విజయ్‌కు ఇది 65వ చిత్రం కావడం విశేషం. ఇది మురుగదాస్‌తోనే ఉంటుందని చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. వాటిని నిజం చేస్తూ తొందర్లోనే అధికారిక ప్రకటన చేసేందుకు సన్‌ పిక్చర్స్‌ రెడీ అవుతోంది. అప్పుడే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించడనుంది. కాగా, విజయ్‌ తొందర్లోనే రాజకీయాల్లోకి వస్తాడని, ఇప్పటికే ఆయన తండ్రి ఆ పనుల్లో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆలోపు సమాజానికి సందేశం ఇచ్చే బలమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని విజయ్‌ భావిస్తున్నాడట. అలాంటి చిత్రాలకు సరైన దర్శకుడు మురుగదాసే కాబట్టి ఆయనతోనే 65వ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. తమిళనాడులో ప్రస్తుత రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని మురుగదాస్‌ కథ, కథనం సిద్ధం చేస్తున్నాడని టాక్‌. అది ఎంత వరకు నిజమో తెలియదు గానీ.. విజయ్‌- మురుగదాస్ కాంబినేషన్‌ అనగానే సౌత్‌ ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఏర్పడడం ఖాయం. దానికి తగ్గట్టుగా సినిమాను నిర్మించాలని సన్‌ పిక్చర్స్‌ కసరత్తులు చేస్తోందట.

    Also Read: నిర్మాత లాభం కోసం.. ప్రభాస్ రిస్క్ !

    అయితే, కరోనా సంక్షోభం నేపథ్యంలో నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికాలు తగ్గించుకోవాలని నిర్మాతలు కోరుతున్నారట. మిగతా వాళ్లకు మార్గదర్శకంగా నిలిచేందుకు విజయ్‌, మురుగదాస్‌ తమ రెమ్యునరేషన్‌ను తగ్గించుకొని ఈ ప్రాజెక్టుకు సంతకం చేశారని తెలుస్తోంది. దాంతో మిగతా నటులు, సిబ్బంది కూడా వాళ్ల బాటలోనే నడవనున్నారు. కాగా, విజయ్‌ నటించిన ‘మాస్టర్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ‘ఖైదీ’ ఫేమ్‌ లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మరో స్టార్ హీరో విజయ్‌ సేతుపతి విలన్‌గా నటించాడు. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కరోనా లేకపోయి ఉంటే వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేది. ఓటీటీ నుంచి ఆఫర్లు వస్తున్నా.. థియేటర్లలోనే రిలీజ్‌ చేయాలని చిత్ర బృందం భావిస్తోంది.