https://oktelugu.com/

బాప్‌రే.. ప్రభాస్‌ ఆదిపురుష్‌ గ్రాఫిక్స్‌కే రూ. 250 కోట్లు!

రెబల్‌ స్టార్ ప్రభాస్‌ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మార్మోగుతోంది. అతని సినిమాలేవీ రిలీజ్‌ కు రెడీగా లేవు. అతనే ప్రమోషన్స్‌లోనూ పాల్గొనడం లేదు. అయినా సరే మన డార్లింగ్‌ గురించి దేశం మొత్తం చర్చించుకుంటోంది. కేవలం ఓ సినిమా అనౌన్స్‌మెంట్‌తో బాలీవుడ్‌ ఇండస్ట్రీ మొత్తం తన గురించి చర్చించుకునేలా చేశాడు ప్రభాస్‌. బాహుబలి తర్వాత అతను ఇండియన్‌ స్టార్ గా మారితే ఇప్పుడు ఓ హిందీ సినిమా ప్రకటనతోనే అక్కడి బడా హీరోలను తలదన్నే స్టార్డమ్‌ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 20, 2020 / 03:56 PM IST
    Follow us on


    రెబల్‌ స్టార్ ప్రభాస్‌ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మార్మోగుతోంది. అతని సినిమాలేవీ రిలీజ్‌ కు రెడీగా లేవు. అతనే ప్రమోషన్స్‌లోనూ పాల్గొనడం లేదు. అయినా సరే మన డార్లింగ్‌ గురించి దేశం మొత్తం చర్చించుకుంటోంది. కేవలం ఓ సినిమా అనౌన్స్‌మెంట్‌తో బాలీవుడ్‌ ఇండస్ట్రీ మొత్తం తన గురించి చర్చించుకునేలా చేశాడు ప్రభాస్‌. బాహుబలి తర్వాత అతను ఇండియన్‌ స్టార్ గా మారితే ఇప్పుడు ఓ హిందీ సినిమా ప్రకటనతోనే అక్కడి బడా హీరోలను తలదన్నే స్టార్డమ్‌ డార్లింగ్‌ సొంతమైంది. తానాజీ ఫేమ్ ఓం రౌత్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ అనే సినిమా ఒప్పుకున్న సంగతి తెలిసిందే. టైటిల్‌, పోస్టర్ను రిలీజ్‌ చేసినప్పటి నుంచి అందరి దృష్టి ఈ సినిమాపైనే నిలిచింది. ఈ చిత్రం కథేంటి? హీరోయిన్ ఎవరు? బడ్జెట్‌ ఎంత? ఎప్పుడు రిలీజ్‌ అవుతుంది? అని తెగ చర్చించుకుంటున్నారు.

    Also Read: నిర్మాత లాభం కోసం.. ప్రభాస్ రిస్క్ !

    ఈ మూవీలో ప్రభాస్‌ రాముడిగా నటించబోతున్నాడని ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ హింట్‌ ఇవ్వడంతో ప్రాజెక్టుపై మరింత క్రేజ్‌ ఏర్పడింది. బాహుబలిలో రాజుగా మెప్పించిన రెబల్‌ స్టార్ తొలిసారి పౌరాణిక పాత్ర చేయబోతున్నాడని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. చెడుపై మంచి సాధించిన విజయ సంబురం అనే ట్యాగ్‌లైన్‌ ఉండడంతో ఇది కచ్చితంగా రామాయణం, రామరావణుల యుద్ధం బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందనిపిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్‌ దీన్ని భారీ బడ్జెట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ‘ఆదిపురష్’‌ కోసం రూ. 500 కోట్లు రెడీ చేసిందని.. కాదు ఏకంగా వెయ్యి కోట్లతో సినిమాను నిర్మిస్తుందన్న వార్తలు వస్తున్నాయి. తాజాగా మరో ఆసక్తికర విషయం బయటికొచ్చింది. బడ్జెట్‌ లెక్కలను పక్కనబెడితే ఈ మూవీకి భారీ గ్రాఫిక్స్‌, విజువల్‌ ఎఫెక్స్‌ అవసరం కానున్నాయి. దాంతో, కేవలం వీఎఫ్‌ఎక్స్‌ కోసమే నిర్మాతలు ఏకంగా రూ. 250 కోట్లు పైచిలుకు ఖర్చు చేయాలని ప్లాన్‌ చేస్తున్నారట. బాహుబలి మాదిరిగా ఆదిపురుష్‌ ప్రేక్షకులకు విజువల్‌ ట్రీట్‌ ఇవ్వనుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతానికైతే 500 కోట్ల బడ్జెట్‌… అందులో సగం విజువల్‌ ఎఫెక్ట్స్ ‌ కోసమే ఖర్చు చేయాలని నిర్మాతల్లో ఒకరైన భూషన్‌ కుమార్ భావిస్తున్నారని సమాచారం.

    Also Read: నాని హిట్ అయితేనే.. మిగతా హీరోలకు మార్కెట్ !

    ఈ లెక్కన వీఎఫ్‌ఎక్స్‌ కోసం అత్యధిక బడ్జెట్‌ వాడిన ఇండియన్‌ సినిమాగా ‘ఆదిపురుష్‌’ నిలుస్తుంది. మరోవైపు ఈ మూవీలో ప్రభాస్‌ సరసన సీత క్యారెక్టర్లో నేషనల్‌ అవార్డు విన్నర్ కీర్తి సురేశ్‌ నటించే అవకాశం కనిపిస్తోంది. ఇక, ‘ఆదిపురుష్‌’ను పూర్తిగా త్రీడీలో చిత్రకరించనున్నారు. హిందీ, తెలుగులో ఒకేసారి షూట్‌ చేసే ఈ చిత్రాన్ని మరో ఐదారు భాషల్లో విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్‌ చేస్తోంది. ప్రస్తుతం రాధకృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధ్యేశ్యామ్‌’లో నటిస్తున్న ప్రభాస్‌.. ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌తో ఓ సినిమాకు ఒప్పుకున్నాడు. ఈ రెండు కూడా పాన్‌ ఇండియా చిత్రాలుగా ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకురానున్నాయి.