
తమిళ్ స్టార్ విజయ్ కి ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. రజినీకాంత్ తరువాత ఆ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్న ఘనత ఒక్క విజయ్ కే సాధ్యం అయింది. అందుకే, తమిళనాట, కేరళలో థియేటర్లో విజయ్ సినిమా పడితే చాలు.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు దద్దరిల్లుపోతాయి. ఇక ఈ కరోనా కష్టకాలంలో మళ్ళీ థియేటర్లకు ఆ పూర్వ వైభవం రావాలి అంటే, విజయ్ లాంటి మాస్ హీరోల సినిమాలు థియేటర్లోనే రిలీజ్ కావాలి. అప్పుడే జనం థియేటర్ల బాట పడతారు. డిస్ట్రిబ్యూటర్ల, ఎగ్జిబిటర్ల అందరూ ఇప్పుడు ఇదే మాట చెబుతున్నారు. విజయ్ కూడా అదే ఆలోచనతో తన కొత్త సినిమా “మాస్టర్” విడుదలని ఏప్రిల్ నుంచి పోస్ట్ ఫోన్ చేసుకుంటూనే ఉన్నాడు.
Also Read: అశ్లీలతపై కేంద్రం ఉక్కుపాదం.. ఓటీటీలకు తిప్పలు తప్పవా?
ఎప్పుడో ఆ మధ్యనే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని అయిపోయిన ఈ మూవీ ఫస్ట్ కాపీతో రెడీగా ఉంది. పైగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ ఇప్పటికే అమ్మారు కూడా. కాకపోతే, థియేటర్లో మొదట సినిమా విడుదలైన తర్వాతే డిజిటల్ రిలీజ్ అనే పద్దతిలో నిర్మాతలు ఈ సినిమాని అమ్ముకున్నారు. ఇప్పుడు డైరెక్ట్ గా డిజిటల్ ప్రీమియర్ కి రైట్స్ ఇవ్వండి అంటూ డిజిటల్ కంపెనీలు వెంట పడుతున్నాయి. ఇప్పటికే సూర్య లాంటి మరో స్టార్ హీరో సినిమా ‘ఆకాశమే హద్దుగా’ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయి క్లాసిక్ మూవీగా సూపర్ హిట్ ను అందుకుంది. దాంతో ఓటీటీల చూపు విజయ్ ‘మాస్టర్’ మీద పడింది.
Also Read: స్టార్ హీరోల సినిమాలు పండుగకేనట.. కానీ చిన్న ట్వీస్ట్..!
కాగా ఈ క్రమంలో రానున్న సంక్రాంతికి తమ ఓటిటీ ప్లాట్ ఫామ్ లోనే “మాస్టర్” మూవీని రిలీజ్ చేస్తామని నెట్ ఫ్లిక్స్ సంస్థ ‘మాస్టర్’ నిర్మాతకు కళ్ళు చెదిరే ఆఫర్ ఇచ్చిందని.. ఈ సినిమా మేకర్స్ ఆ ఆఫర్ కి బాగా టెంప్ట్ అయ్యారని సమాచారం. దాంతో ఈ సినిమా రిలీజ్ మళ్ళీ ట్రేండింగ్ లోకి వచ్చి చేరింది. అయితే, సినిమా రిలీజ్ అనేది ఒక్క నిర్మాత చేతిలోనే లేదు. విజయ్ యస్ చెబితేనే నిర్మాత ముందుకు వెళ్లగలడు. కానీ, విజయ్ మాత్రం ‘మాస్టర్’ సినిమాని ఇప్పటికీ థియేటర్లోనే విడుదల చెయ్యాలని అంటున్నట్లు తెలుస్తోంది.దాంతో మాస్టర్ రిలీజ్ పై గందరగోళం నెలకొంది. మరి చూడాలి చివరకు మాస్టర్ రాక ఎలా ఉండబోతుందో.