
జీహెచ్ఎంపీ ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. శనివారం బేగంపేట మ్యారీగోల్డ్ హోటల్లో మర్వాడి, గుజరాతీ వ్యాపార వేత్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా ప్యాకేజీ కింద కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్లు ప్రకటించిందని, ఆ ప్యాకేజీతో ఎవరికి ఉపయోగం లేదన్నారు. కేంద్రం ప్రవేశపెడుతున్న ప్యాకేజీలు వ్రుథా అన్నారు. హైదరాబాద్ లో రోహింగ్యాలు ఉన్నట్లు బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారని, అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని విమర్శించారు. స్థానిక సమస్యలు పట్టించుకోని బీజేపీ హైదరాబాద్ ను ఎలా అభివ్రుద్ధి చేస్తుందన్నారు.