https://oktelugu.com/

Vijayendra Prasad : విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి కి ఇచ్చిన కథలు మాత్రమే సక్సెస్ అవుతున్నాయి… మిగతావి ఎందుకు ఆడటం లేదు.. కారణం ఏంటి..?

ప్రతి సినిమా విషయం లో దర్శకులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమాను సక్సెస్ ఫుల్ గా నిలపాల్సిన బాధ్యత కూడా వాళ్ల మీదనే ఉంటుంది...ఇక దర్శక ధీరుడు గా తనకంటూ ఒక మంచి పేరు సంపాదించుకొని పాన్ ఇండియా లో తెలుగు సినిమా ఖ్యాతి ని నిలబెట్టిన దర్శకుడు రాజమౌళి...ఇప్పటి వరకు ఈయన చేసిన అన్ని సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించాయి...

Written By:
  • Vicky
  • , Updated On : September 8, 2024 / 04:16 PM IST

    Vijayendra Prasad Stories

    Follow us on

    Vijayendra Prasad : తెలుగు సినిమా ఇండస్ట్రీలో రైటర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న విజయేంద్ర ప్రసాద్ తనదైన రీతిలో పాన్ ఇండియాలో టాప్ రైటర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు తన కొడుకు రాజమౌళికి మాత్రమే కథలను అందిస్తూ భారీ సక్సెస్ లను అందుకుంటున్నాడు. ఇక వేరే దర్శకులకు కూడా కథలను అందిస్తున్నప్పటికీ వాటి మీద పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించడం లేదు. నిజానికి విజయేంద్ర ప్రసాద్ రాజమౌళికి ఇచ్చిన సినిమాలను మినహాయిస్తే మిగిలిన ఏ సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ సాధించలేకపోతున్నాయి. కారణం ఏంటి అనే విషయం మీదనే ప్రస్తుతం చాలా రకాల చర్చలైతే జరుగుతున్నాయి. నిజానికి విజయేంద్ర ప్రసాద్ రాసిన కథకి రాజమౌళి అందించే ట్రీట్ మెంట్ గాని అవుట్ పుట్ గానీ చాలా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుంది. అందువల్లే ఆయన రాసిన దాని కంటే రాజమౌళి 100 రేట్లు ఎక్కువ స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తాడు కాబట్టే వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలుస్తున్నాయి.

    ఇక ఇదిలా ఉంటే విజయేంద్ర ప్రసాద్ ఇచ్చే కథలు కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నప్పటికీ ఆ దర్శకులు వాటిని ఓన్ చేసుకోలేక బెస్ట్ ఔట్ పుట్ ను తీసుకురాలేకపోతున్నారనేది కొంతమంది వాదన… ఇక మొత్తానికైతే రాజమౌళి విజయేంద్ర ప్రసాద్ కాంబినేషన్ చాలా ఎక్స్ట్రార్డినరీ కాంబినేషన్ అనే చెప్పాలి. నిజానికి రాజమౌళి లాంటి దర్శకుడు సినిమా ఇండస్ట్రీలో ఉండడం తెలుగు సినిమా చేసుకున్న అదృష్టమనే చెప్పాలి.

    ఆయన ఎలాంటి స్టోరీ అయిన సరే తన మార్క్ ఎలివేషన్, ఎమోషన్స్ తో విజయ తీరాలకు చేర్చడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అందుకే రాజమౌళి ఇండస్ట్రీలో దర్శక దీరుడి గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు. విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన కథలో మ్యాటర్ ఉన్నప్పటికీ ఆ కథ మీద రాజమౌళి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని సినిమాను చేస్తూ ఉంటాడు. అందువల్లే మిగతా డైరెక్టర్లకు దక్కని సక్సెసులు రాజమౌళికి మాత్రమే దక్కుతున్నాయి…

    ఇక అలాగే విజయేంద్ర ప్రసాద్ కూడా రాజమౌళి వల్లే స్టార్ గా ఎదిగాడు అనేది మాత్రం వాస్తవం… ఇక రాజమౌళి తీసిన బాహుబలి, త్రిపుల్ ఆర్ సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకున్న విజయేంద్రప్రసాద్ స్టార్ రైటర్ గా ఎదగడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు…