https://oktelugu.com/

Tollywood Heroins : 10 నిమిషాలకు కోట్ల రూపాయిలు తీసుకునే హీరోయిన్స్ ఎక్కడ..? వీళ్ళకి వరద బాధితులు కనిపించట్లేదా? వీళ్ళు అసలు మనుషులేనా!

చిన్న హీరోలు కూడా వాళ్ళ సంపాదనకు తగ్గట్టుగా సీఎం రిలీఫ్ ఫండ్ కి డబ్బులు పంపారు. కానీ ఒక్క అగ్ర హీరోయిన్ అయినా వరద బాధితులకు సహాయం చేస్తారా అని ఇన్ని రోజులు ఎదురు చూసాము, ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఇలాంటి సమయంలో చిన్న హీరోయిన్ గా పిలవబడే అనన్య నాగేళ్ల రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి తన తాహతకు తగ్గట్టుగా విరాళం అందించింది.

Written By:
  • Vicky
  • , Updated On : September 8, 2024 / 04:09 PM IST

    Tollywood Heroins

    Follow us on

    Tollywood Heroins :  యాక్టింగ్ రాదు, తెలుగు బాషా మాట్లాడడం అసలు రాదు, కేవలం అందాలను ఆరబోయడం తప్ప అనేక మంది టాప్ హీరోయిన్లు చేస్తున్నది ఏమి లేదు. కానీ ఒక్కో సినిమాకి కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకుంటారు, వీళ్ళు జీవితం గడుపుతున్నదే తెలుగు సినిమా ప్రేక్షకుల కారణంగా, వారికి విపత్కర సమయం వచ్చినప్పుడు అండగా నిలబడాలి అనే ద్యాస వీరిలో ఏ కోశానా లేదు. మళ్ళీ వీళ్ళు ఏదైనా షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్తే, గంటకి 50 లక్షలు డిమాండ్ చేస్తారు. కాస్త పెద్ద హీరోయిన్స్ అయితే 10 నిమిషాలకు కోటి రూపాయిలు కూడా వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ విధంగా దోచుకొని తింటున్న వీళ్ళని మనం ఇంకా ఆదరించాల్సిన అవసరం ఉందా?. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలలో వరదలు వచ్చిన వెంటనే స్టార్ హీరోలందరూ వరుసపెట్టి విరాళాలు ఇచ్చేందుకు మన ముందుకు వచ్చారు.

    చిన్న హీరోలు కూడా వాళ్ళ సంపాదనకు తగ్గట్టుగా సీఎం రిలీఫ్ ఫండ్ కి డబ్బులు పంపారు. కానీ ఒక్క అగ్ర హీరోయిన్ అయినా వరద బాధితులకు సహాయం చేస్తారా అని ఇన్ని రోజులు ఎదురు చూసాము, ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఇలాంటి సమయంలో చిన్న హీరోయిన్ గా పిలవబడే అనన్య నాగేళ్ల రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి తన తాహతకు తగ్గట్టుగా విరాళం అందించింది. ఈమెని చూసి మిగిలిన హీరోయిన్స్ అందరూ సిగ్గు తెచ్చుకొని కనీసం ఒక్కొక్కరు లక్ష రూపాయిలు అయినా డొనేట్ చేస్తారని అనుకున్నాము, కానీ ఒక్కరు కూడా చేయలేదు. రీసెంట్ గానే నాగ బాబు కుమార్తె నిహారిక కొణిదెల కూడా 10 గ్రామాలకు గాను 5 లక్షల రూపాయిలు డొనేట్ చేసింది. ఇది చిన్న విరాళమే, కానీ ఆ మాత్రం కూడా మిగిలిన హీరోయిన్లు చేయలేదు కదా. సమాజ సేవ స్ఫూర్తి ఉండే సమంత ఏమైంది?, కనీసం తన ఇంస్టాగ్రామ్ లో వరద బాధితులకు సంబంధించి ఒక్క స్టోరీ కూడా పెట్టలేదు, ఆమె ఈరోజు అగ్ర కథానాయికగా కొనసాగుతుంది తెలుగు ప్రేక్షకుల వల్లే. ఇక తమన్నా, కీర్తి సురేష్, పూజ హెగ్డే, రష్మిక వీళ్లంతా ఏమయ్యారు?.

    కొత్తగా వచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తెలుగు అమ్మాయి శ్రీలీల ఎక్కడికి పోయింది. ఈమెకి సేవా కార్యక్రమాలు అంటే చాలా ఇస్తామని విన్నాము, ఒక్క బాబు ని దత్తత తీసుకొని పెంచుకుంటుంది కూడా, ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసే శ్రీలీల కి కూడా మన ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు గుర్తుకు రాలేదా?, చాలా కాలం తర్వాత మన తెలుగు అమ్మాయి స్టార్ హీరోయిన్ అయ్యింది అని వాళ్లంతా ఎంతో మురిసిపోయారు, కానీ శ్రీలీల మాత్రం తనకు ఈ వరదలకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తుంది. ఈ ఒక్క సంఘటనతో హీరోయిన్స్ మీద ఉండే కాస్త గౌరవం కూడా పోయింది, భవిష్యత్తులో వీరిని ఆడియన్స్ ఎలా ఆదరిస్తారో చూడాలి.