https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : టాస్కులు ఆడలేని విష్ణు ప్రియకి ఇంత రెమ్యూనరేషనా..? హద్దులు దాటేస్తున్న ‘బిగ్ బాస్8’ బడ్జెట్!

ఒక అమ్మాయి మీద అలాంటి ఆరోపణలు ఎలా చేస్తావు అంటూ సోనియా పై తీవ్రంగా మండిపడింది విష్ణు ప్రియా. చివరికి సోనియా అభయ్ వద్ద కూర్చొని ఏడుస్తున్నప్పటికీ కూడా ఆమె సోనియా ని వదలలేదు.

Written By:
  • Vicky
  • , Updated On : September 8, 2024 / 04:27 PM IST

    Vishnu Priya Remuneration

    Follow us on

    Bigg Boss Telugu 8 : టీవీ షోస్ లో యాంకర్ గా ఎప్పటి నుండో బుల్లితెర ఆడియన్స్ ని అలరిస్తున్న విష్ణు ప్రియా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. మనిషి చూస్తే మంచి అమ్మాయి లాగానే అనిపిస్తుంది కానీ, ఈమెకి కోపం వస్తే నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తుంది అనేది ఈ వారం రోజులు చూసిన తర్వాత ఆడియన్స్ కి ఒక క్లారిటీ వచ్చింది. నిన్న సోనియా కి విష్ణు ప్రియా కి మధ్య చిన్న ఫైట్ జరిగింది. ఈ ఫైట్ లో విష్ణు ప్రియా తప్పు లేదు. కానీ గొడవ పెద్దది చేసుకుంది మాత్రం విష్ణు ప్రియనే. జరిగిన గొడవని అక్కడితో వదిలేయకుండా, ఎందుకు ఇలా మాట్లాడావు, ఒక అమ్మాయి మీద అలాంటి ఆరోపణలు ఎలా చేస్తావు అంటూ సోనియా పై తీవ్రంగా మండిపడింది విష్ణు ప్రియా. చివరికి సోనియా అభయ్ వద్ద కూర్చొని ఏడుస్తున్నప్పటికీ కూడా ఆమె సోనియా ని వదలలేదు.

    ఈమెకే కాదు, ఆమె అన్న మాటలకు నేను కూడా ఏడవాలి. ఒక అమ్మాయి అయ్యుండి, ఇంకో అమ్మాయి మీద అలాంటి అబద్దాలు చెప్పొచ్చా, ఎదో ఈమె ఆకాశం నుండి ఊడిపడినట్టు, పుణ్య స్త్రీ లాగా బిల్డప్స్ ఇస్తుంది అంటూ సోనియా ని మరింత కృంగిపోయి ఏడ్చేలా చేసింది. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. ఎక్కువ శాతం మంది విష్ణు ప్రియా కి సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఆమెకి ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి. కానీ నిజానికి ఇద్దరిలోనూ తప్పు ఉంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ టాస్కులు విషయం లో విష్ణు ప్రియా చాలా వీక్ అని అర్థం అవుతుంది. కేవలం జోకులు వేయడం, యోగాసనాలు చేయడం తప్ప, ఈమె మార్కుని ఇప్పటి వరకు క్రియేట్ చేసుకోలేకపోయింది. అంతే కాదు ఈమె ఎదో పుట్టినప్పటి నుండే కోటీశ్వరురాలు అయ్యినట్టు నాకు ఇంటి పనులు చేయడం అలవాటు లేదు, ఇన్ని పనులు చెప్పారు, నేను ఒక్కటి కూడా చేయలేను అని మొన్న తన టీం సభ్యులతో అంటుంది.

    అప్పుడు నబీల్ నువ్వేమి కంగారు పడకురా, అవసరమైతే నీ బదులు నేనే పని చేస్తాను అని ధైర్యం చెప్తాడు. టాస్కులు ఆడదు, పనులు చెయ్యదు, మరి ఇక ఎందుకు ఈమె బిగ్ బాస్ హౌస్ కి వచ్చినట్టు?, ప్రుథ్వీ రాజ్ కి లైన్ వెయ్యడానికా?, ఆ పని బయట కూడా చేసుకోవచ్చు కదా అనేది ఆడియన్స్ అభిప్రాయం. ఈమెకి బిగ్ బాస్ టీం వారానికి 4 లక్షల రూపాయిలు ఇస్తున్నారు, హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికంటే ఈమెకే ఎక్కువ రెమ్యూనరేషన్, అంత డబ్బులు తీసుకుంటున్నప్పుడు, దానికి తగ్గ న్యాయం ఎంతో కొంత చేయాలి కదా?, ఇలాగే ఆమె కొనసాగితే ఆమెకి ఉన్న ఫ్యాన్ బేస్ వల్ల టాప్ 5 లోకి రావొచ్చు కానీ, టైటిల్ మాత్రం కొట్టలేదని అంటున్నారు విశ్లేషకులు.