https://oktelugu.com/

SSMB29: ఎస్ఎస్ఎంబి 29 సెట్స్ కి ఎప్పుడు వెళ్తుందో చెప్పిన విజయేంద్ర ప్రసాద్…

SSMB29: మొత్తానికైతే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది అనే దాని మీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు. ఇక ఈ సినిమా రైటర్ అయిన విజయేంద్ర ప్రసాద్ రీసెంట్ గా ఈ సినిమా మీద స్పందిస్తూ...

Written By:
  • Gopi
  • , Updated On : June 13, 2024 / 06:10 PM IST

    Vijayendra Prasad said when SSMB29 will go to sets

    Follow us on

    SSMB29: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎస్ ఎస్ఎంబి 29 సినిమా గురించే డిస్కస్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాని రాజమౌళి పాన్ వరల్డ్ లో తెరకెక్కిస్తుండడం విశేషం.. ఇక ఎప్పుడైతే ఈ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చిందో అప్పటినుంచి దీని మీద భారీ బజ్ అయితే క్రియేట్ అయింది. ఇక మొత్తానికైతే ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేసిన రాజమౌళి ఈ సినిమాని తొందర్లోనే సెట్స్ మీదకి తీసుకెళ్తాము అంటూ చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు.

    మరి మొత్తానికైతే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది అనే దాని మీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు. ఇక ఈ సినిమా రైటర్ అయిన విజయేంద్ర ప్రసాద్ రీసెంట్ గా ఈ సినిమా మీద స్పందిస్తూ ఈ మూవీ మీద ఉన్న కొన్ని అనుమానాలను అయితే తేటతెల్లం చేశాడు. అందులో మొదటిది త్రిబుల్ ఆర్ సినిమా లాగా ఈ సినిమా కూడా పీరియాడికల్ డ్రామా సినిమాగా తెరకెక్కుతుందా అని అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానంగా ఈ సినిమా ప్రియాడికల్ నేపథ్యంలో రావడం లేదు.

    Also Read: Pushpa 2: పుష్ప 2 కి పోటీగా దిగుతున్న రెండు సినిమాలు ఇవే…

    ప్రస్తుత కాలంలోనే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాము. కాంటెంపరరీ ఇష్యూస్ తోనే ఈ సినిమా అనేది ముందుకు సాగబోతుంది అంటూ తను ఈ సినిమా మీద ఒక సరైన క్లారిటీ అయితే ఇచ్చాడు. దీంతో ఈ సినిమా మీద ఉన్న అనుమానాలు చాలావరకు తొలగిపోతాయి. ఇక ఈ సినిమా సెట్స్ మీదకి ఎప్పుడు వెళ్తుంది అనే దాని మీద కూడా ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేసినప్పటికీ రాజమౌళి ఈ సినిమాకి సంబంధించిన సెట్ వర్క్స్ ని చేయిస్తున్నట్టుగా తెలుస్తుంది.

    Also Read: Lavanya Tripathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠికి ఏమైంది? ఆందోళన రేపుతున్న ఫోటో!

    ఇక సెట్ వర్క్స్ మొత్తం పూర్తయిన తర్వాత ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్తున్నామని అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ ఇచ్చిన తర్వాతే ఈ మూవీని పట్టాలెక్కిస్తారట… అయితే ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మరొక నెల నుంచి రెండు నెలల సమయం వరకు పట్టొచ్చు అని ఆయన చెప్పడం విశేషం…