https://oktelugu.com/

Pushpa 2: పుష్ప 2 కి పోటీగా దిగుతున్న రెండు సినిమాలు ఇవే…

Pushpa 2: అల్లు అర్జున్ మరొకసారి ది బెస్ట్ యాక్టర్ గా గుర్తింపు పొందాలని చూస్తున్నాడు. ఇక పుష్ప సినిమా కోసం ఆయనకు ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు వచ్చిన విషయం మనకు తెలిసిందే.

Written By:
  • Gopi
  • , Updated On : June 13, 2024 / 04:37 PM IST

    These are the two films competing with Pushpa 2

    Follow us on

    Pushpa 2: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కు చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. ఇక మొదటి సినిమా నుంచి ఆయన చాలా బాగా కష్టపడుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరు ప్రతిష్టలను ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఎప్పుడైతే పుష్ప సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకర్షించాడో అప్పటినుంచి ఆల్ ఇండియా లెవెల్లో ఆయన పేరు మారూమ్రోగుతుంది. ఇక దానికి తగ్గట్టుగానే పుష్ప 2 సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించడానికి తీవ్రమైన కసరత్తులనైతే చేస్తున్నాడు.

    ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్, టీజర్స్ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో అల్లు అర్జున్ మరొకసారి ది బెస్ట్ యాక్టర్ గా గుర్తింపు పొందాలని చూస్తున్నాడు. ఇక పుష్ప సినిమా కోసం ఆయనకు ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇక మొత్తానికైతే పుష్ప 2 ఆగస్టు 15వ తేదీన తన సత్తా ఏంటో చూపించుకోడానికి రెడీ అవుతుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకి పోటీగా ఇప్పటికే బాలీవుడ్ లో జాన్ అబ్రహం హీరోగా వస్తున్న వేదా సినిమా రిలీజ్ అవుతుండగా ఇప్పుడు మరో సినిమా కూడా పుష్పకి పోటీ గా రానుంది అనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

    Also Read: Prudhvi Raj: నటుడు 30 ఇయర్స్ పృథ్వి పై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన కోర్టు! ఆయన చేసిన తప్పేంటి?

    ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో వైవిధ్యమైన అంశాలను ఎంచుకుంటూ సూపర్ సక్సెస్ లను అందుకునే ఏకైక హీరో విక్రమ్.. ఈయన ప్రస్తుతం పా రంజిత్ డైరెక్షన్ లో చేస్తున్న తంగలన్ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాని కూడా పుష్పకి పోటీగా బరిలోకి దింపుతున్నారు.

    Also Read: Lavanya Tripathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠికి ఏమైంది? ఆందోళన రేపుతున్న ఫోటో!

    ఇక ఈ సినిమాలు రిలీజ్ అవ్వడం వల్ల ప్రతి సినిమాకి కూడా నష్టమైతే జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఏ సినిమా విజయం సాధించిన కూడా ఓపెనింగ్స్ మాత్రం భారీ రేంజ్ లో రాబట్టలేవు అనేది వాస్తవం.. ఇక అలాగే స్క్రీన్స్ విషయంలో కూడా కొంతవరకు అన్యాయం జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇండివిజ్యూవల్ గా వస్తేనే పెద్ద సినిమాలు సూపర్ సక్సెస్ అవుతాయి అనేది మనం ఇప్పటికి చాలా సార్లు చూశాం…ఇక ఇదిలా ఉంటే అప్పటి వరకు బరిలో ఏ సినిమా ఉంటుందో వేచి చూడాలి అంటూ సినిమా పండితులు సైతం వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…