https://oktelugu.com/

Devara: దేవర రిలీజ్ మీద క్లారిటీ ఇచ్చిన మేకర్స్…పవన్ కళ్యాణ్ తో పోటీ పడటం అవసరమా..?

నిజానికి ఈ సినిమా ఏప్రిల్ లోనే రిలీజ్ కావాల్సింది. కానీ సినిమాకి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ అలాగే ఇంక కొంచెం షూట్ కూడా బ్యాలెన్స్ ఉండడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : June 13, 2024 / 06:06 PM IST

    Devara

    Follow us on

    Devara: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక నందమూరి ఫ్యామిలీ మూడోతరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ వరుస సక్సెస్ లను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ లను అందుకోవడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన కొరటాల శివ డైరెక్షన్ లో దేవర అనే సినిమా చేస్తున్నాడు.

    అయితే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నప్పటికీ ఈ సినిమా రిలీజ్ డేట్ అనేది ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ లోనే రిలీజ్ కావాల్సింది. కానీ సినిమాకి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ అలాగే ఇంక కొంచెం షూట్ కూడా బ్యాలెన్స్ ఉండడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమా మేకర్స్ సెప్టెంబర్ 27వ తేదీన సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టుగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు.

    అయితే అదే తేదీన పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న ఓజి సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి పవన్ కళ్యాణ్ తో కావాలనే జూనియర్ ఎన్టీఆర్ పోటీ పెట్టుకుంటున్నాడా లేదా పవన్ కళ్యాణ్ సినిమా ఆ డేట్ కు రాలేదు మళ్ళీ దాన్ని పోస్ట్ పోన్ చేస్తారనే ఉద్దేశ్యంతోనే ఆయన ఈ సినిమాను అనౌన్స్ చేశారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

    ఇక మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా మీదనే భారీ ఆశలైతే పెట్టుకున్నాడు. మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఇంతకు ముందు త్రిబుల్ ఆర్ సినిమా తో వచ్చిన పాన్ ఇండియా గుర్తింపును కాపాడుకుంటూ ఈ సినిమాను సూపర్ సక్సెస్ చేయాలని చూస్తున్నాడు…