Mahesh – Rajamouli movie : దేశంలో ఉండే సినీ అభిమానులు మొత్తం మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎప్పుడో పదేళ్ల క్రితమే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఖరారు అయ్యింది. కానీ మహేష్ , రాజమౌళి తమకి ఉన్న కమిట్మెంట్స్ ని పూర్తి చేసుకొని, జత కలపడానికి ఇన్నేళ్ల సమయం పట్టింది. మన టాలీవుడ్ హాలీవుడ్ సినిమాలకు పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగిన తర్వాత ఈ కాంబినేషన్ సెట్ అవ్వడం మన తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలు అవుతుంది అనే దానిపై ఇంకా అభిమానులకు మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం తో అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. కానీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతూనే ఉంది.
అల్యూమినియం ఫ్యాక్టరీ లో నిర్వహిస్తున్న వర్క్ షాప్ లో మహేష్ బాబు ప్రతీ రోజు ఈ సినిమాలోని పాత్రకు తగ్గట్టుగా తనని తానూ మలుచుకునేందుకు ఎంతో కష్టపడుతున్నాడు. ఇది కాసేపు పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ‘మాస్టర్ క్లాస్ బై మిస్టర్ విజయేంద్ర ప్రసాద్’ అనే కార్యక్రమంలో చెప్పుకొచ్చాడు. మహేష్ – రాజమౌళి సినిమా వచ్చే ఏడాది జనవరి నుండి షూటింగ్ కార్యక్రమాలను ప్రారంభించుకోబోతుందని, ఈ సినిమా కథ రాయడం కోసం రెండేళ్ల సమయం తీసుకున్నానని చెప్పుకొచ్చాడు. అమెజాన్ అడవుల్లో సాగే కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని, ప్రముఖ హాలీవుడ్ స్టార్స్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించబోతున్నారని, ఇప్పటి వరకు ఇండియన్ సినిమా ప్రేక్షకులు ఎప్పుడూ చూడని ఒక కొత్త ప్రపంచంలోకి రాజమౌళి ఈ సినిమా ద్వారా తీసుకెళ్ళబోతున్నాడని చెప్పుకొచ్చాడు విజయేంద్ర ప్రసాద్. కెరీర్ లో ఎప్పుడూ కనిపించని లుక్ లో మహేష్ బాబు ఈ సినిమాలో కనపడబోతున్నాడట. ఇటీవలే ఆయన కొన్ని సందర్భాలలో ఈ లుక్ తో కనిపించేలోపు అభిమానులు ఆశ్చర్యానికి గురి అయ్యారు.
పొడవాటి జుట్టు, గుబురు గెడ్డం తో హాలీవుడ్ హీరోని తలపించేలా ఆయన లుక్స్ ఉన్నాయి. అలాగే ఈ సినిమాకి ‘గరుడ’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఇందులో అక్కినేని నాగార్జున మహేష్ బాబు కి తండ్రిగా నటించబోతున్నాడని టాక్. ఆయన క్యారక్టర్ కూడా సినిమాలో చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందట. అంతే కాదు ఈ సినిమాకి పని చేసే టెక్నీషియన్స్ మొత్తం హాలీవుడ్ కి సంబంధించిన వాళ్ళు అవ్వడం విశేషం. కేవలం భారత దేశం లో ఉండే భాషల్లోనే కాదు, ఇతర దేశ భాషల్లో కూడా ఈ చిత్రం అనువదించి విడుదల చేయబోతున్నారు. #RRR ద్వారా వచ్చిన హాలీవుడ్ మార్కెట్ ని ఈ చిత్రంతో సంపూర్ణంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారు మేకర్స్. 2026 వ సంవత్సరం ద్వితీయార్థంలో ఈ సినిమా విడుదల కాబోతుందట.