https://oktelugu.com/

Hero Sudhir Babu : ఆ హీరోల సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు చాలా సంతోషించాను – హీరో సుధీర్ బాబు

ఈ చిత్రంలో షాయాజీ షిండే సుధీర్ బాబు కి తండ్రి పాత్రలో కనిపించాడు. కతమొత్తం వీళ్లిద్దరి చుట్టూనే తిరుగుతుంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా సుధీర్ బాబు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.

Written By:
  • Vicky
  • , Updated On : October 9, 2024 / 09:28 PM IST

    Hero Sudhir Babu

    Follow us on

    Hero Sudhir Babu :  ఇండస్ట్రీ కి వచ్చి చాలా కాలం అయ్యినప్పటికీ, ఇప్పటికీ కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకోలేకపోయిన హీరో సుధీర్ బాబు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ నుండి వచ్చినప్పటికీ, మంచి టాలెంట్ ఉన్నప్పటికీ కూడా సరైన స్క్రిప్ట్స్ ని ఎంచుకోకపోవడం వల్ల ఈయన నటించిన సినిమాలన్నీ ఒకదానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. ఇప్పటి వరకు ఈయన తన కెరీర్ లో 23 సినిమాలు చేసాడు. వాటిల్లో కేవలం ‘ప్రేమ కథా చిత్రం’ మాత్రమే కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఎప్పుడొచ్చాయో, ఎప్పుడు వెళ్ళాయో మహేష్ బాబు అభిమానులకు కూడా గుర్తు లేదు. అలాంటి సినిమాలు చేసాడీయన. ఆయన గత చిత్రం ‘హరోంహర’ కమర్షియల్ గా యావరేజ్ రేంజ్ లో ఆడింది. ఫస్ట్ హాఫ్ ఉన్న రేంజ్ లో సెకండ్ హాఫ్ లేకపోవడంతో సినిమా ఫలితం తేడా కొట్టింది.

    ఇప్పుడు ఈయన ‘మా నాన్న సూపర్ హీరో’ అనే చిత్రం ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షోస్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని సెలెక్టివ్ థియేటర్స్ లో కాసేపటి క్రితమే విడుదల చేసారు. ఫస్ట్ హాఫ్ పూర్తి అయ్యింది, మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఈ చిత్రంలో షాయాజీ షిండే సుధీర్ బాబు కి తండ్రి పాత్రలో కనిపించాడు. కతమొత్తం వీళ్లిద్దరి చుట్టూనే తిరుగుతుంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా సుధీర్ బాబు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.

    ఆయన మాట్లాడుతూ ‘కొన్ని కథలు నాకు నచ్చక రిజెక్ట్ చేశాను. ఆ సినిమాలు వేరే హీరోలు చేసారు. హిట్ అయ్యినప్పుడు అయ్యో మంచి కథని మిస్ అయ్యాము అనే ఫీలింగ్ వచ్చింది. అలాగే నేను రిజెక్ట్ చేసిన సినిమాలు వేరే హీరోలు చేసి అవి ఫ్లాప్ అయ్యినప్పుడు కాస్త ఆనందం వేసింది’ అంటూ చెప్పుకొచ్చాడు. దీనిపై సోషల్ మీడియా లో సెటైర్లు వేయడం మొదలు పెట్టారు నెటిజెన్స్. నువ్వు ఎంచుకున్న కథలన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి, అలా ఉంటుంది నీ స్క్రిప్ట్ సెలక్షన్, అలాంటిది నువ్వు రిజెక్ట్ చేసిన సినిమాలు వేరే హీరోలు చేసారంటే వాళ్ళు ఎంత వెర్రోళ్ళు అనేది అర్థం అవుతుంది అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరోపక్క ఈ సినిమా ప్రొమోషన్స్ కోసం సుధీర్ బాబు ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షో లో కూడా ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి తన సినిమాని ప్రమోట్ చేసుకున్నాడు. ఈ ప్రొమోషన్స్ లో సాయాజీ షిండే కి వచ్చిన ఒక గొప్ప ఆలోచన నాగార్జున కి చెప్పడం, ఆ వీడియో ని చూసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్