https://oktelugu.com/

Vijayendra Prasad: ‘మహేష్ – రాజమౌళి’ పై విజయేంద్రప్రసాద్ క్రేజీ కామెంట్స్

Vijayendra Prasad: సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శక ధీరుడు రాజమౌళి చేయబోతున్న పాన్ ఇండియా సినిమా పై రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. ‘ప్రస్తుతం ఈ సినిమా కథను సిద్ధం చేస్తున్నాం. స్క్రిప్ట్ ఇంకా పూర్తి కాలేదు. అడవి నేపథ్యంలో కథ సాగుతుంది. వచ్చే ఏడాది రాజమౌళి-మహేష్ సినిమా ప్రారంభం అవుతుంది. జూన్ నుంచి త్రివిక్రమ్ సినిమాతో మహేష్ బిజీగా ఉంటాడు’ అని విజయేంద్రప్రసాద్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. నిజానికి మహేష్ కోసం […]

Written By:
  • Shiva
  • , Updated On : May 10, 2022 / 06:04 PM IST
    Follow us on

    Vijayendra Prasad: సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శక ధీరుడు రాజమౌళి చేయబోతున్న పాన్ ఇండియా సినిమా పై రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. ‘ప్రస్తుతం ఈ సినిమా కథను సిద్ధం చేస్తున్నాం. స్క్రిప్ట్ ఇంకా పూర్తి కాలేదు. అడవి నేపథ్యంలో కథ సాగుతుంది. వచ్చే ఏడాది రాజమౌళి-మహేష్ సినిమా ప్రారంభం అవుతుంది. జూన్ నుంచి త్రివిక్రమ్ సినిమాతో మహేష్ బిజీగా ఉంటాడు’ అని విజయేంద్రప్రసాద్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

    Vijayendra Prasad

    నిజానికి మహేష్ కోసం విజయేంద్ర ప్రసాద్‌, కథను ఆఫ్రికన్‌ ఫారెస్ట్‌ నేపథ్యంలో రాశారని.. ఆ ఫారెస్ట్‌ లో ఉన్న నిధుల గుట్టల పై ఈ సినిమా సాగుతుందని గతంలో వార్తలు వినిపించాయి. ఫారెస్ట్‌ లో ఉన్న నిధుల అంటే.. ఆ నిధుల కోసం ప్రపంచ సాహస వీరులు అంతా పోటీ పడతారట. ఎవరికీ వారు ఎత్తులకు పై ఎత్తులు వేసి క్రమంలో ప్రత్యర్థులను చంపుతూ నిధి వేటకు బయలు దేరుతారని తెలుస్తోంది.

    Also Read: Crazy News: బాబోయ్.. ఇదెక్కడ దరిద్రం ? ప్రభాస్ కాస్త చెప్పవయ్యా

    మొత్తమ్మీద ఫారెస్ట్‌ లో జరిగే యాక్షన్‌ ఎడ్వెంచరెస్‌ సీన్లు అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది. ఎలాగూ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కించడంలో రాజమౌళి మహా దిట్ట. పైగా ఆఫ్రికన్‌ ఫారెస్ట్‌ నేపథ్యం ఇండియన్ సినిమాకి పూర్తిగా కొత్త నేపథ్యం కూడా. ఇంతవరకు భారతీయ సినీ చరిత్రలో ఆ నేపథ్యంలో సినిమా రాలేదు.

    Mahesh-Rajamouli

    అలాగే, తాజాగా ఈ సినిమా బడ్జెట్‌ పై సోషల్‌ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. బాహుబలి సిరీస్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ మించిన బడ్జెట్‌తో, అంటే దాదాపు 800 కోట్ల రూపాయలతో మహేశ్‌ సినిమా ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ లుక్ పై కూడా ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మహేష్ లుక్ పూర్తి రఫ్ లుక్ లో ఉంటుందట. అలాగే మహేష్ మీసాలతో కనిపించబోతున్నాడని తెలుస్తోంది.

    రాజమౌళి హీరో అంటేనే.. మాస్ కి పరాకాష్ట. అందుకు తగ్గట్టుగానే హీరో లుక్ ను రాజమౌళి డిజైన్ చేస్తాడు. ఈ క్రమంలోనే మహేష్ లుక్ కోసం జక్కన్న ప్రత్యేక కసరత్తులు చేశాడు. గతంలో ఏ సినిమాలో కనిపించని విధంగా మహేష్ ఈ సినిమాలో కనిపిస్తాడట. మొత్తానికి ఈ వార్త సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ను ఇస్తోంది. ఎందుకంటే.. మహేష్ లుక్ మారితే.. ముఖ్యంగా మీసాలతో మహేష్ కనిపిస్తే చూడాలని ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

    Also Read:Star Heroine: స్టార్ హీరోయిన్ ప్రేమ పాఠాలు.. కుర్రాళ్ళ ఉత్సాహం

    Tags