Ex Minister Narayana Arrest: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నేత, నారాయణ విద్యాసంస్థల చైర్మన్ నారాయణను సీఐడీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో ఆయనను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఏపీలో జరిగిన పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీకేజీ వ్యవహారం పెద్ద దుమారమే రేపుతోంది. గతంలో కూడా పలుమార్లు పేపర్లు లీకైనట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నారాయణ అరెస్టు చర్చనీయాంశం అవుతోంది.

పదో తరగతి ప్రశ్నపత్రాలను వాట్సాప్ లో షేర్ చేసినందుకు నారాయణను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ తో సహా మరికొందరిని అరెస్టు చేశారు. వీరితో పాటు ఈ వ్యవహారంలో అనుమానమున్న పలువురిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల దర్యాప్తులో కొన్ని కోణాలు బయటకు వస్తున్నాయి. ఫోన్లలో కీలక డేటా బయటడటంతో కేసు మరింత లోతుగా విచారిస్తున్నారు. తమ విద్యార్థులకే ర్యాంకులు రావాలనే ఉద్దేశంతోనే పేపర్ లీక్ చేసినట్లు తెలుస్తోంది.
Also Read: YSR Congress Alliance: పొత్తులపై మాట మార్చిన వైసీపీ
ప్రశ్నపత్రాలను ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మరికొంత మంది ప్రమేయం ఉన్నట్లు తేలడంతో వారిని కూడా అరెస్టు చేశారు. ఉఫాధ్యాయుల పాత్ర కూడా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసమే ఎవరెవరి పాత్ర ఉందో వారందరిని విచారిస్తున్నట్లు సమాచారం.

నారాయణను ఆయన నివాసంలోనే అరెస్టు చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఆయన పాత్ర ఉన్నట్లు ఆధారాలు లభించడంతోనే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన అరెస్టును ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. పదో తరగతి ప్రశ్నపత్రాల వరుసగా లీకేజీ కావడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. విచారణలో విస్తుగొలిపే అంశాలు వెల్లడయినట్లు చెబుతున్నారు. అందుకేు నారాయణను అరెస్టు చేశారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ మాత్రం ఇంకా ఏ ప్రకటన చేయలేదు. నారాయణ అరెస్టుపై ఎలాంటి ఖండనలు రాలేదు.
Also Read:TRS-BJP: టీఆర్ఎస్-బీజేపీ పొత్తు గుట్టు రట్టు
Recommended Videos:



[…] […]
[…] […]