Homeఎంటర్టైన్మెంట్Vijay shocking comments: నా భార్య 30 ఏళ్ళు ఎదురు చూసి..సరిగ్గా ఎన్నికల సమయంలో వెన్నుపోటు...

Vijay shocking comments: నా భార్య 30 ఏళ్ళు ఎదురు చూసి..సరిగ్గా ఎన్నికల సమయంలో వెన్నుపోటు పొడిచింది – విజయ్

Vijay shocking comments: ఈ నెల 23న తమిళనాడు లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల కోసం దేశం మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది. అత్యధిక శాతం సర్వేలు మరోసారి DMK పార్టీ నే అధికారం లోకి వస్తుందని చెప్పగా, కొన్ని సర్వేలు AIDMK కి అనుకూలంగా వచ్చాయి. ఇవి రెండు కాకుండా, ఒంటరిగా పోటీ చేస్తున్న విజయ్(Thalapathy Vijay) TVK పార్టీ కి అధికారం లోకి వచ్చేంత సత్తా అసలు లేదని, విజయ్ పోటీ చేసే రెండు స్థానాలు కూడా గెలవడం చాలా కష్టమని, కానీ ఆయన పార్టీ కి 8 నుండి 12 శాతం వోటింగ్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి. మరోపక్క విజయ్ ఎన్నికల ప్రచారం మాత్రం ఒక రేంజ్ లో చేస్తున్నాడు. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఆ ప్రసంగాలకు సంబంధించిన వీడియోలే కనిపిస్తున్నాయి.

ఇకపోతే నేడు ఆయన తూతుకుడి , తిరునెల్ వెళ్లి ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలను నిర్వహించాడు. ఈ సభల్లో ఆయన తన సతీమణి సంగీత గురించి పరోక్షంగా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనం గా మారింది. ఆయన మాట్లాడుతూ ’30 సంవత్సరాల నుండి నా చుట్టూ ఉన్న వాళ్ళు , సరిగ్గా ఎన్నికల సమయం లో వెన్నుపోటు పొందడానికి ముందుకు వచ్చారు. అలా ఎందుకు చేస్తున్నారో మీ అందరికీ తెలిసిందే. మీరు ఎంత మందిని అడ్డం పెట్టుకొని నా మీద రాజకీయాలు చెయ్యాలని చూసినా, నన్ను నా అభిమానుల నుండి దూరం చెయ్యలేరు ‘ అంటూ చాలా ఎమోషన్ తో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. విజయ్ తన విడాకుల వ్యవహారం గురించి మాట్లాడడం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. అయితే plan ప్రకారమే విజయ్ ee నెగెటివిటీ ని దూరం చేసుకునే పనిలో పడినట్టు తెలుస్తోంది.

నిన్న ఇన్ స్టాగ్రామ్ లో త్రిష పెట్టిన ఒక స్టోరీ ఎంతటి హాట్ టాపిక్ గా మారిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇన్ని రోజులు విజయ్ తో రిలేషన్ లో ఉన్నాను అంటూ వస్తున్న వార్తలు మొత్తం ట్రాష్ అన్నట్టుగా చెప్పుకొచ్చింది. కానీ తమిళనాడు లో అనేక ఈవెంట్స్ లో వీళ్లిద్దరు కలిసి పాల్గొన్నారు. అంత పబ్లిక్ గా దొరికిపోయిన తర్వాత కూడా ఇంకా వాదించే ప్రయత్నం చేస్తున్నారు, ఇది కేవలం ఓట్ల కోసం చేసున్న జిమ్మిక్స్ అంటూ మండిపడుతున్నారు నెటిజెన్స్. మరి ఇందులో ఎంత వరకు నిజమో, ఎంత వరకు అబద్దం అనేది రాబోయే రోజుల్లో ఫలితాల రూపం లో తేలనుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version