Homeబిజినెస్Mahindra Bolero: ఈ కారులో 9 మంది ఒకేసారి వెళ్లొచ్చు..

Mahindra Bolero: ఈ కారులో 9 మంది ఒకేసారి వెళ్లొచ్చు..

Mahindra Bolero: భారతదేశంలో SUV కాళ్లకు రోజురోజుకు డిమాండ్ పెరిగిపోతుంది. విశాలమైన స్పేస్ ఉన్న కార్లు కావాలని వినియోగదారులు కోరుతుండడంతో కంపెనీలు సైతం వారికి అనుగుణంగా ఆకర్షణీయమైన SUV లను తీసుకువస్తున్నాయి. అయితే ఈ సెగ్మెంట్లో ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న Mahindra and Mahindra కంపెనీ Bolero వాహనాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే 2026 సంవత్సరంలో దీని అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఏడాది మార్చి నెలలో బొలెరో 9,788 యూనిట్ల విగ్రహాలు జరిగాయి. ఏడాది ప్రాతిపదికన చూస్తే 22% వృద్ధి సాధించినట్లు తెలుస్తుంది. అయితే ఇందులో ఉమ్మడి ఫ్యామిలీ సభ్యులంతా ఒకేసారి ప్రయాణం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా వాణిజ్య అవసరాలకు కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు. ఇంతకీ ఈ కారు విశేషాలు ఏంటంటే?

Mahindra Bolero కొన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ వేరియంట్ లో బొలెరో నియో ప్లస్ అనే మోడల్ ఎక్కువమంది ప్రయాణికులను తీసుకెళ్లేలా తయారు చేశారు. ఇందులో 9 మంది ప్రయాణికులు ఒకేసారి వెళ్లవచ్చు. దీనిని రూ.10.90 లక్షల ప్రారంభం ధర నుంచి విక్రయిస్తున్నారు. అయితే సాధారణ బొలెరో తో పోలిస్తే ఇందులో ప్రత్యేకమైన ఫీచర్లు ఉంటాయి. ఈ వెహికల్ లో 2.2 లీటర్ల డీజిల్ ఇంజన్ ఉండనుంది. ఇది 118.35 బిహెచ్పి పవర్ను అందిస్తుంది. 280 nm పార్కు నో రిలీస్ చేసే ఇందులో బూట్ స్పేస్ ఎక్కువగా ఉండనుంది. 16 అంగుళాల గ్రే మెటాలిక్ వీల్స్ తో పాటు LED హెడ్ లాంప్స్, ఫాగ్ లాంప్స్ ఉండలున్నాయి. బాక్సింగ్ డిజైన్ తో ఆకర్షించే ఈ వెహికల్ లో సేఫ్టీ కోసం డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, EBD తో కూడిన ABS, రియల్ పార్కింగ్ సెన్సార్లు కనిపిస్తాయి.

ఇంటీరియర్ విషయానికి వస్తే లేటెస్ట్ టెక్నాలజీ తో కూడిన ఫీచర్లు ఉన్నాయి. ఇందులో నైన్ అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంతో పాటు బ్లూటూత్, క్రూయిస్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్ విండోస్ వంటివి ఉంటాయి. దూర ప్రయాణాలు చేయడానికి అనుగుణంగా దీనిని ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా ఫ్యామిలీ అంతా కలిసి విహారయాత్రలకు వెళ్లి ఎందుకు ఈ వాహనం ఎంతో అనుగుణంగా ఉంటుంది. ధర కూడా అందుబాటులోనే ఉండడంతో ఉమ్మడి ఫ్యామిలీ వారు దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికే మహీంద్రా కు చెందిన ఎన్నో వెహికల్స్ ఎస్ యు వి వేరియంట్ లో అలరించాయి. ఇది కూడా ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version