Vijay Varma : గత కొంతకాలంగా సోషల్ మీడియా లో హీరోయిన్ తమన్నా(Tamannaah Bhatia), విజయ్ వర్మ(Vijay Varma) బ్రేకప్ స్టోరీ గురించి ఎన్నో కథనాలు ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే. చాలా కాలం నుండి ఈ జంట కలిసి ప్రైవేట్ పార్టీలకు వెళ్లడం, పబ్బులకు వెళ్లడం వంటివి చేస్తూ మీడియా కంట పడడం వంటివి మనం గమనిస్తూనే ఉన్నాం. వీళ్ళ మధ్య ఉన్న రిలేషన్ ని చూసి, ఒకరిని ఒకరు వదిలి క్షణం కూడా ఉండలేకపోతున్నారు అని అంతా అనుకున్నారు. కానీ మూడేళ్లకే బ్రేకప్ చెప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకు బ్రేకప్ చేసుకున్నారు అనే దానిపై ఎలాంటి అధికారిక కారణం బయటకు రాలేదు, కానీ తమన్నా కి డేటింగ్ తర్వాత విజయ్ ని పెళ్లి చేసుకోవాలని ఉన్నప్పటికీ, విజయ్ అందుకు అంగీకరించలేదని, అందుకే బ్రేకప్ అయ్యిందని బాలీవుడ్ లో ఒక రూమర్ చక్కర్లు కొడుతోంది.
Also Read : రేపే చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ ప్రారంభోత్సవం..ముఖ్య అతిథి ఎవరంటే!
ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే విజయ్ వర్మ తమన్నా తో బ్రేకప్ జరిగిన విషయంపై పరోక్షంగా స్పందిస్తూ ‘రిలేషన్ షిప్ అనేది ఒక ఐస్ క్రీం లాంటిది. ప్రతీ క్షణం మనం దానిని అస్వాదిస్తూ ఉండాలి. మధ్యలో సుఖాలు, బాధలు, కష్టాలు, గొడవలు కూడా వస్తుంటాయి. వాటిని కూడా స్వీకరిస్తూ ముందుకు పోవాలి. లేకపోతే ఆ రిలేషన్స్ ముందుకు కొనసాగవు, మధ్యలోనే ఆగిపోతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అంతకుముందు తమన్నా కూడా రిలేషన్ షిప్ పై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తాను నిస్వార్థమైన ప్రేమను నమ్ముతానని, ఎప్పుడైతే స్వచ్ఛమైన ప్రేమగా వ్యాపార లావాదేవిగా మారుస్తామో, అక్కడి నుండే అసలు సమస్యలు మొదలు అవుతాయి, రిలేషన్ లో ఉన్నప్పటి కంటే, రిలేషన్ నుండి బయటకు వచ్చినప్పుడే నేను ఎక్కువ సంతోషంగా ఉన్నాను అంటూ ఆమె మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి.
ఇలా ఈ ఇద్దరు మాజీ ప్రేమికులు ఒకరి పై ఒకరు పరోక్షంగా మాట్లాడుకోవడం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపిన తమన్నా ఇప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తుంది. ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘ఓదెల 2’ చిత్రం ఏప్రిల్ 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదలకు ముందే ప్రీ రిలీజ్ నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ రేట్ కి అమ్ముడుపోయాయి. సంపత్ నంది దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ‘ఓదెల రైల్వే స్టేషన్’ కి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం నేరుగా థియేటర్స్ లో విడుదల కాలేదు కానీ, ఆహా మీడియా లో వెబ్ ఫిలిం లాగా విడుదలైన అద్భుతమైన రెస్పాన్స్ ని తెచ్చుకుంది.
Also Read : ‘రాబిన్ హుడ్’ మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు..నితిన్ కెరీర్ లోనే వరస్ట్!