GT vs MI : ఐపీఎల్ లో శనివారం రసవత్తరమైన పోరు జరగనుంది. ఐపీఎల్ లో ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచిన జట్టు.. అత్యంత ఫ్యాన్ బేస్ కలిగిన జట్టు ముంబై ఇండియన్స్ (Mumbai Indians) శనివారం.. ఐపీఎల్ లో ఒకసారి విజేత, మరోసారి రన్నరప్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) తో తలపడుతోంది. అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా ఇటీవల జరిగిన మ్యాచ్లో ఢిల్లీ జట్టు గుజరాత్ పై విజయం సాధించింది. గుజరాత్ గెలుపు దిశగా పయనిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఢిల్లీ జట్టు బౌలర్లు గేర్ మార్చడంతో.. ఒత్తిడిలో కూరుకుపోయిన గుజరాత్ జట్టు ఓటమిపాలైంది. మరోవైపు చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓటమిపాలైంది. ముంబై ఇండియన్స్ జట్టులో బ్యాటింగ్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇక ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో గుజరాత్ బౌలింగ్ వైఫల్యం కళ్ళ ముందు కనిపించింది. మొత్తంగా చూస్తే ఈ రెండు జట్లు బౌలింగ్, బ్యాటింగ్ వైఫల్యంతో బాధపడుతూనే ఉన్నాయి. తొలి మ్యాచ్ లు ఈ రెండు జట్లకు ఓటములను అందించడంతో శనివారం జరిగే మ్యాచ్లో ఏ మేరకు ఆడతాయనేది చూడాల్సి ఉంది. గుజరాత్ జట్టు బ్యాటింగ్ భారాన్ని మొత్తం గిల్, సాయి సుదర్శన్, ఫిలిప్స్, బట్లర్ మోస్తున్నారు. మిగతా ఆటగాళ్లు రూథర్ఫోర్డ్, షారుక్ ఖాన్ వంటి వారు తమ బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సి ఉంది.. ఇక బౌలర్ల విషయంలోనూ రబాడ మినహా మిగతావారు సత్తా చూపించాల్సిన అవసరం ఉంది. మహమ్మద్ సిరాజ్ లైన్ అండ్ లెంగ్త్ తో బంతులు విసిరితే ప్రయోజనం ఉంటుంది..
ముంబై జట్టులో..
ముంబై జట్టు విషయానికొస్తే రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ వంటి వారు తమ తరహా ఇన్నింగ్ ఆడాల్సి ఉంది. చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో రోహిత్ సున్నా పరుగులకే అవుట్ అయ్యాడు. చెన్నై మైదానంతో పోల్చితే అహ్మదాబాద్ మైదానం కూడా అలాంటిదే. ఇక ఈ మ్యాచ్లో పరుగుల వరద పారేది అనుమానమే. చెన్నై పిచ్ మాదిరిగానే అహ్మదాబాద్ పిచ్ కూడా విభిన్నంగా ఉంటుంది.. తొలి మ్యాచ్ కు దూరమైన కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ఈ మ్యాచ్ ద్వారా జట్టులోకి ప్రవేశిస్తున్నాడు. అతడితోపాటు విల్ జాక్స్ పేస్ విభాగాన్ని పంచుకోనున్నాడు. అయితే అహ్మదాబాద్ మైదానంపై హార్దిక్ పాండ్యాకు విపరీతమైన పట్టు ఉన్న నేపథ్యంలో బౌలింగ్ కూర్పు లో ఎలాంటి మార్పులు చేస్తాడనేది ఆసక్తి కరం. ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఐపీఎల్ లో ఐదుసార్లు తలపడ్డాయి. ఇప్పటివరకు గుజరాత్ మూడుసార్లు.. రెండుసార్లు ముంబై ఇండియన్స్ గెలిచింది. గూగుల్ ప్రిడిక్షన్ ప్రకారం ముంబై జట్టుకు 52%.. గుజరాత్ జట్టుకు 48 శాతం విజయావకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. గుజరాత్, ముంబై జట్లు ఐపీఎల్ 18వ ఎడిషన్ లో ఎదుర్కొన్న తొలి మ్యాచ్ లలో ఓటమిపాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్లకు విజయాలు కచ్చితంగా కావాలి. అలాంటప్పుడు శనివారం జరిగే పోరు హోరాహోరిగా సాగే అవకాశం ఉంది. క్రికెట్ విశ్లేషకులు అంచనా ప్రకారం టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అహ్మదాబాద్ పిచ్ విభిన్నంగా ఉంటుంది.. బౌలర్లు పండగ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. మొత్తంగా చూస్తే ఈ మ్యాచ్లో విజయావకాశాలను టాస్ నిర్దేశిస్తుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read : IPL టికెట్ ₹2,343.. టాక్స్ లు ₹1,657..