Varasudu First Song: థమన్ కు నాదస్వరం అచ్చి వచ్చినట్టుంది. సర్కార్ వారి పాట లో కళావతి మాదిరిగానే ఈసారి కూడా థమన్ దానినే నమ్ముకున్నాడు. దిల్ రాజ్ నిర్మాతగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్, రష్మిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ద్వి భాషా చిత్రం వారసుడు లో తొలి సింగిల్ విడుదలయింది. సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. వరుస ప్లాప్ ల నేపథ్యంలో దిల్ రాజు, బీస్ట్ పరాజయం తర్వాత విజయ్ ఈ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా తొలి సింగిల్ ను వివేక్ రాశాడు. మొదట తమిళ్ వెర్షన్ విడుదల చేశారు. రంజితమే అంటూ సాగే ఈ పాటను విజయ్, మానస పాడారు. ఈ పాటకి నృత్య రీతులను జానీ మాస్టర్ సమకూర్చారు. పాట విడుదలయిన కొద్ది సేపటికే మిలియన్ వ్యూస్ దక్కించుకుంది.

కళావతి మాదిరే..
మహేష్ హీరోగా రూపొందిన సర్కారు వారి పాట లో కళావతి పాటకు ఎక్కువగా నాదస్వరాన్ని థమన్ వినియోగించాడు. ఆ పాట సూపర్ హిట్ కావడంతో అదే విధానాన్ని రంజితమే అనే పాటకు కూడా ఉపయోగించాడు.. పూర్తి తమిళ్ కల్చర్ లో సాగే ఈ బీట్ చెవులకు విన సొంపుగా ఉంది. బిగిల్ లో టైటిల్ సాంగ్ పాడి అదరగొట్టిన విజయ్.. ఈ సినిమాలోనూ అదే ఊపు కొనసాగించాడు. ఈ పాట మెలోడీ, ఫాస్ట్ మేళవింపుతో సాగుతుంది. ఈ పాటలో ట్యూన్స్ కళావతి, జై బాలయ్య ను గుర్తుకు తెస్తాయి. తన ట్యూన్లు తానే కాపీ కొట్టుకోవడం థమన్ కి కొత్త కాదు. అలా చేసినా అతడి అవకాశాలకు కొదువ లేదు. అన్నట్టు ఈ పాట కొరియోగ్రఫీ కూడా హలమత్తి హబీబో ను గుర్తుకు తెస్తుంది. అటు ట్యూన్స్ కాపీ, ఇటు డ్యాన్స్ కూడా కాపీ, స్టిల్స్ కూడా మహర్షి సినిమాలో మాదిరే ఉన్నాయి.
ఈ సినిమాపై దిల్ రాజు ఆశలు
కొద్ది రోజులుగా వరుస ప్లాప్ లతో దిల్ రాజు ఇబ్బంది పడుతున్నాడు. ఆ మధ్య కార్తీకేయ_2 కు థియేటర్ల కేటాపుంపు రచ్చ చూశాం కదా! దిల్ రాజు ఇజ్జత్ మొత్తం పోయింది. తర్వాత వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అరవింద్ తో కలిసి హిట్ హిందీ లో తీస్తే అది కూడా ఫట్ మన్నది. ఇప్పుడు వేరే మార్గం లేదు. అందుకే తమిళ్ పై కాన్సెంట్రేట్ చేశారు. బీస్ట్ ప్లాప్ తో నిరాశలో ఉన్న విజయ్ ని కలిశాడు. వంశీతో వారసుడు ని పట్టాలు ఎక్కించాడు. తెలుగులో విజయ్ కి అంత మార్కెట్ లేదు కాబట్టి ముందుగా తమిళంలో పాట విడుదల చేయించాడు. తెలుగులో తర్వాత విడుదల చేస్తారట.. సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ బరిలో ఉండడంతో.. ఎందుకైనా మంచిదని తమిళంలోనే ఎక్కువ థియేటర్లలో విడుదల చేస్తున్నారట! పైగా అక్కడ విజయ్ కి మంచి మార్కెట్ ఉండడంతో నాలుగు రాళ్లు వెనకేసుకుందామని దిల్ రాజు ప్లాన్! మరి ఇది నెరవేరుతుందో లేదో చూడాలి.