Munugodu KA Paul : మునుగోడులో ఇటీవల జరిగిన ఉపఎన్నికలు ఎంత ప్రతిష్టాత్మకంగా మారిందో మన అందరికి తెలిసిందే..అధికార తెరాస పార్టీ మరియు బీజేపీ మధ్య ఈ ఎన్నికలు నువ్వా నేనా అనే విధంగా హోరాహోరీగా సాగింది..ఇక ఫలితాలు వెల్లడించే రోజు రానే వచ్చింది..మొదటి 5 రౌండ్లు బీజేపీ పార్టీ ఆధిక్యత చూపించగా, ఆ తర్వాతి రౌండ్స్ నుండి తెరాస పార్టీ ఆధిక్యత చూపిస్తూ ముందుకు దూసుకుపోతుంది..ప్రస్తుతం 7 రౌండ్లు ముగిసేలోపు రెండు వేల ఓట్లకు పైగా ఆదిక్యతని చూపిస్తున్న తెరాస పార్టీ చివరికి 5 వేల ఓట్ల మెజారిటీ తో గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇక సీరియస్ గా జరుగుతున్న ఎన్నికలలో ఆటవిడుపు లాగ KA పాల్ గారి కామెడీ లేకపోతే ఎలా..పాపం పాల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి మునుగోడు ప్రజానీకానికి అద్భుతమైన వినోదం ని పంచుతూనే వస్తున్నాడు..ఇక ఈరోజు ఇప్పటి వరుకు జరిగిన కౌంటింగ్ లో కేఏ పాల్ కి వచ్చిన ఓట్లు ఎంతో తెలిస్తే పగలబడి నవ్వుకుంటారు.
7 రౌండ్ల ఓట్లలో సుమారు 60 వేల ఓట్లు లెక్కిస్తే పాపం KA పాల్ కి కేవలం 320 ఓట్లు మాత్రమే వచ్చాయట..ఇది ఇప్పుడు హైలైట్ గా మారింది..దీనిపై పాల్ స్పందిస్తూ ‘2 లక్షల మంది ఓటర్లు ఉన్న మునుగోడు లో మాకు లక్ష ఓట్లు కచ్చితంగా వచుంటాయి..కానీ బీజేపీ మరియు తెరాస పార్టీలు ఈవీఎంలు గ్యాంబ్లింగ్ చేసాయి..మొన్ననే నేను చూశాను..సుమారు 240 ఖాళి ఈవీఎం లు ఇక్కడకి తీసుకొచ్చి దొంగ ఓట్లు గుద్దించారు..ఈ సమాచారం మొన్న మేము మీడియా కి కూడా వెల్లడించాము’.
‘దీనిపై మేము కచ్చితంగా న్యాయం కోసం కోర్టు కి వెళ్లి పోరాటం చేస్తాం..ఈ ఎలక్షన్ ని రద్దు చేయించి మళ్ళీ ఎన్నికలు పెట్టిస్తాను..ఈసారి ఈవీఎంలు లేకుండా పోస్టల్ బాలట్ వోటింగ్ ఉండేలా తెస్తాను..కచ్చితంగా మాకు లక్ష మంది ఓట్లు వేశారు ఈ ఎన్నికలలో..అది మాత్రం బలంగా చెప్పగలను’ అంటూ పాల్ చేస్తున్న కామెడీ ఇప్పుడు సోషల్ మీడియా లో ట్రేండింగ్ అవుతుంది.