spot_img
Homeఎంటర్టైన్మెంట్Vijay: విజయ్ గెలుపు సినిమా స్టైల్ లో సాగిందా...

Vijay: విజయ్ గెలుపు సినిమా స్టైల్ లో సాగిందా…

Vijay: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న నటుడు విజయ్…రజినీకాంత్ తర్వాత అంత గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న నటుడు కూడా తనే కావడం విశేషం… ఇక ఇలాంటి క్రమంలోనే గత సంవత్సరంలో ఆయన టీవీకే అనే రాజకీయ పార్టీని పెట్టి రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. ఇక ఈ క్రమంలోనే అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ అతని మీద తీవ్రమైన విమర్శలు చేస్తూ అతన్ని తొక్కేసే ప్రయత్నం చేసింది. అయినప్పటికి విజయ్ మాత్రం జనాల మెప్పు పొందుతూనే వచ్చాడు. ఎట్టకేలకు రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టివికే పార్టీ 108 సీట్లు కైవసం చేసుకోవడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నిజంగా తమిళనాడు ప్రజలు విజయ్ వెంటే ఉన్నారు అనేది ప్రూవ్ చేశారు.

తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ లో 234 సీట్లు ఉన్నాయి. ఒక పార్టీ గవర్నమెంట్ ను ఫామ్ చేయాలంటే 118 సీట్లు అయితే కావాలి. విజయ్ కి 108 సీట్లు వచ్చాయి. కాబట్టి మరొక పది సీట్లు అదనంగా ఆడైతే ఆయన గవర్నమెంట్ ను ఫామ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక ప్రస్తుతం ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థులను, చిన్నచితక పార్టీల్లో గెలిచిన వాళ్ల మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

వాళ్లతో కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేయాలనే ప్రయత్నంలో తను ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే విజయ్ పార్టీ పెట్టిన సంవత్సరంలోనే గెలుపొందడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇప్పటివరకు ఎవరికి సాధ్యం రీతిలో ఆయన విజయమైతే సాగింది. నిజానికి విజయ్ గెలుపు ఒక సినిమా స్టైల్ లో సాగింది. ఇలా పార్టీ పెట్టేసి అలా గెలిచేసాడు.

ఇక ఏది ఏమైనా కూడా విజయ్ గెలుపు అనేది ఓకే కానీ తమిళనాడు ప్రజల కష్టాలను తెలుసుకొని వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మాత్రం విజయ్ మీద తీవ్రమైన విమర్శలు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. తను గెలుపు కోసం పెద్దగా కష్టపడలేదు. కాబట్టి గెలిచిన తర్వాత ఆయన జనానికి మంచి చేయడానికి ప్రయత్నిస్తే బావుంటుందని కామెంట్స్ చేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Chennai Love Story First Day Collections: ‘చెన్నై లవ్ స్టోరీ’ మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. కిరణ్...

Chennai Love Story First Day Collections: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై , కాస్త...

Dharmendra Pradhan Resignation: మోడీ నో అన్నా.. ఎట్టకేలకు ‘ధర్మేంధ్ర ప్రధాన్‌’ రాజీనామా.. తెరవెనుక ఏం జరిగిందంటే?

Dharmendra Pradhan Resignation: నీట్‌ లీకేజీ వివాదం నేపథ్యంలో నెలల తరబడి సాగిన ఆందోళనలు చివరకు ఫలించాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారు. నీట్‌ ప్రశ్న పత్రం లీకేజీకి...

Akhil Akkineni: అక్కినేని అఖిల్ ఇండియన్ కాదా..? పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం..

Akhil Akkineni: అక్కినేని అఖిల్ రీసెంట్ గానే 'లెనిన్' చిత్రం తో తన కెరీర్ లోనే మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. విడుదలై రెండు వారాలు పూర్తి అయ్యింది , ఇప్పటికీ...

Kajal Aggarwal: నన్ను కసాయి తల్లి అని అనుకున్నా పర్వాలేదు.. నేను అలాగే చేస్తాను : కాజల్...

Kajal Aggarwal: పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకొని లేడీ సూపర్ స్టార్ రేంజ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్స్ లో ఒకరు కాజల్ అగర్వాల్....

Japan And US: జర్మనీ అణు రహస్యం జపాన్‌కు చేరకుండా అడ్డుకున్న అమెరికా.. లేదంటే ప్రపంచ పటమే మారిపోయేది!

Japan And US: ప్రపంచంలో ప్రస్తుతం అణ్వస్త్రాలు కలిగిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. తర్వాత రష్యా, చైనా, భారత్‌ కూడా ఉన్నాయి. ఇక ఏ దేశం కూడా అణ్వాయుధాలు కలిగి ఉండకుండా...
Oktelugu Epaper
Exit mobile version