spot_img
Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan Vs Vijay: పవన్ కళ్యాణ్ vs విజయ్... వీళ్లిద్దరి మధ్య తేడా ఇదేనా...

Pawan Kalyan Vs Vijay: పవన్ కళ్యాణ్ vs విజయ్… వీళ్లిద్దరి మధ్య తేడా ఇదేనా…

Pawan Kalyan Vs Vijay: చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు పవన్ కళ్యాణ్… కెరియర్ స్టార్టింగ్ లోనే సూపర్ హిట్ సినిమాలను చేసి ప్రేక్షకులను అలరించాడు. ఇక ఎప్పుడైతే ఆయన చేసిన సినిమాలు విజయాలను సాధించాయో అప్పటినుంచి ఆయన టాప్ హీరోగా మారిపోయాడు. పవర్ స్టార్ గా తనని తాను ఎలివేట్ చేసుకున్నాడు. అలాంటి నటుడు ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఒకపక్క సినిమాలను చేస్తూనే ఏపీ రాజకీయ రంగంలో కూడా రాణిస్తున్నాడు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న ఆయన తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్నాడు… ఇక ఇదిలా ఉంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో నటుడిగా రాణించిన విజయ్ సైతం టీవీకే అనే రాజకీయ పార్టీ ని పెట్టాడు. ఇక రీసెంట్ గా తమిళనాడు లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ 108 సీట్లను కైవసం చేసుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇప్పటివరకు ఎవరు కూడా అలాంటి రికార్డును సాధించలేదంటూ తమిళనాడులో ఆయన గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు…

పవన్ కళ్యాణ్ 2014 వ సంవత్సరంలో పార్టీ పెడితే 2024వ సంవత్సరంలో ఆయన కంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అయింది. కానీ విజయ్ విషయంలో అలా కాదు ఆయన గత సంవత్సరం పార్టీని పెట్టి ఈ సంవత్సరం అధికారంలోకి వచ్చాడు. పవన్ కళ్యాణ్ కి విజయ్ కి ఉన్న తేడా ఏంటి అంటే తెలుగు రాష్ట్రాల్లోని జనాల మైండ్ సెట్ వేరేలా ఉంటుంది. వాళ్ళు ఎవరిని అంత ఈజీగా నమ్మారు.

కానీ తమిళనాడులో మాత్రం జనాల మెంటాలిటీ మరోలా ఉంటుంది. వాళ్ళు నేషనల్ పార్టీలను దగ్గరికి కూడా రానివ్వరు. లోకల్ పార్టీలకే పెద్ద పీట వేస్తుంటారు. అలాగే మాజీ సీఎం స్టాలిన్ సైతం అత్యుత్తమమైన పాలనను అందించినప్పటికి విజయ్ కొత్త పార్టీ పెట్టడంతో ఒకసారి తనను గెలిపిద్దాం అని జనాలందరు అనుకున్నారు. ఇక దానికి తోడుగా ఎలక్షన్స్ కి ముందు స్టాలిన్ విజయ్ ని తొక్కేయాలనే ప్రయత్నం చేశాడు. అది కూడా విజయ్ మీద సింపతిగా మారి తను గెలవడానికి కారణమైంది.

మొత్తానికైతే ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ చేసుకుంటూ వచ్చిన తర్వాత విజయాన్ని సాధిస్తే, విజయ్ మాత్రం డైరెక్ట్ గా అధికారాన్ని దక్కించుకున్నాడు. విజయ్ గెలవడం ఒకెత్తయితే ఇప్పుడు గెలిచిన తర్వాత నుంచి అతనికి అసలైన టాస్క్ ఎదురవబోతోంది. తన పాలన ఎలా ఉండబోతుంది జనాలందరిని ఆకట్టుకునే విధంగా ఉంటుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో...

Dharmendra Pradhan Resignation: ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా.. స్టేజీపై కాక్రోచ్‌ల వికటట్టహాసం.. వైరల్‌ వీడియో

Dharmendra Pradhan Resignation: నీట్‌ లీకేజీ వివాదం నేపథ్యంలో నెలల తరబడి సాగిన ఆందోళనలు చివరకు ఫలితం ఇచ్చాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ జూలై 25న తన పదవికి రాజీనామా...
Oktelugu Epaper
Exit mobile version