https://oktelugu.com/

బాలీవుడ్ లో అడుగుపెడుతున్న విలక్షణ నటుడు

‘మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి’ తమిళనాడులోనే కాదు దేశంలోనే ఈ జెనెరేషన్ అత్యుత్తమ నటుల్లో ఒకడుగా గుర్తింపు పొందాడు . ఇంతింతై వటుడింతై అన్నట్లుగా షార్ట్ ఫిలిమ్స్ నుండి ఒక్కో మెట్టు ఎదుగుతూ ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా టాప్ లిస్ట్ లో కి చేరాడు.సేతుపతి ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తలపతి విజయ్ హీరోగా వస్తున్న “మాస్టర్ ” చిత్రంలో విలన్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. Also Read: మెగా ఫ్యాన్స్ ను […]

Written By:
  • admin
  • , Updated On : December 23, 2020 / 05:46 PM IST
    Follow us on


    ‘మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి’ తమిళనాడులోనే కాదు దేశంలోనే ఈ జెనెరేషన్ అత్యుత్తమ నటుల్లో ఒకడుగా గుర్తింపు పొందాడు . ఇంతింతై వటుడింతై అన్నట్లుగా షార్ట్ ఫిలిమ్స్ నుండి ఒక్కో మెట్టు ఎదుగుతూ ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా టాప్ లిస్ట్ లో కి చేరాడు.సేతుపతి ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తలపతి విజయ్ హీరోగా వస్తున్న “మాస్టర్ ” చిత్రంలో విలన్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

    Also Read: మెగా ఫ్యాన్స్ ను టెన్షన్ లో పెట్టిన మంచు విష్ణు !

    తమిళ్ లో ఆయన వరసగా మమనిథన్, యతుమ్ యురే యవరుమ్ కెలిర్ మరియు తుగ్లక్ దర్బార్ వంటి చిత్రాలు కూడా చేస్తున్నాడు. ఈ నటుడు తెలుగులో మెగా హీరో వైష్ణవ తేజ్ తొలి చిత్రం ‘ఉప్పెన’లో విలన్ గా నటించాడు. ఈ మూవీ కూడా విడుదలకి సిద్దమవుతుంది. గతంలో అమీర్ ఖాన్’తో కలిసి ‘లాల్ సింగ్ చడ్డా’లో సేతుపతి ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, ఏవో కారణాల వల్ల అతను ఈ చిత్రం నుండి తప్పుకున్నారని సమాచారం.

    Also Read: బిగ్‌బాస్‌ 4‌లో అభిజిత్ ‌కు… కెరీర్‌లో బిగ్గెస్ట్ ప్యాకేజ్ !

    తాజాగా సేతుపతి గురించి ఒక ఆసక్తికరమైన వార్త సంచలనంగా మారింది.ఏమిటంటే… అతను త్వరలో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతున్నాడు. తమిళ్ లో ఫుల్ బిజీగా ఉన్న విజయ్ సేతుపతి త్వరలో బాలీవుడ్‌ వెబ్ సిరీస్‌లో షాహిద్ కపూర్‌తో కలిసి ప్రేక్షకులని ఆకట్టుకోబోతున్నాడట.ఈ కొత్త వెబ్ సిరీస్ షూటింగ్ జనవరిలో ప్రారంభం అవుతుందని, ‘ఫ్యామిలీ మ్యాన్’ చేసిన రాజ్ & డికె ఈ మల్టీ-ఎపిసోడ్ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించబోతున్నారని సమాచారం. విజయ్ సేతుపతిని ఇంతకు ముందెన్నడూ చూడని పాత్రలో చూడబోతున్నారని మేకర్స్ హామీ ఇచ్చారు.దేశవ్యాప్తంగా OTT ప్లాట్ ఫామ్ ద్వారా విడుదలవబోతున్న ఈ వెబ్ సిరీస్ గురించి అతని అభిమానులు మరియు ఆరాధకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్