ఎన్నికల ఎఫెక్ట్.. పశ్చిమ బెంగాల్లో ‘తెలుగు’ వెలుగు..!

తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషకు చెదలు పడుతుండగా పక్కా రాష్ట్రాల్లో మాత్రం గుర్తింపు లభిస్తోంది. ప్రాచీన భాష అయిన తెలుగును గుర్తించడంలో తెలుగు రాష్ట్రాలు నిర్లక్ష్యం చేస్తున్నాయనే విమర్శలున్నాయి. తెలంగాణలో తెలుగు భాషకు ఓ మోస్తరు గుర్తింపు లభిస్తుండగా ఏపీలో మాత్రం కనుమరుగయ్యే స్థితికి చేరుకుంది. Also Read: మోదీకి భారతరత్న ఇవ్వాలంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత..! జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ప్రాథమిక పాఠశాలల్లో తెలుగు మీడియం చదువులకు స్వస్తి పలికేలా నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లీష్ […]

Written By: Neelambaram, Updated On : December 23, 2020 8:07 pm
Follow us on


తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషకు చెదలు పడుతుండగా పక్కా రాష్ట్రాల్లో మాత్రం గుర్తింపు లభిస్తోంది. ప్రాచీన భాష అయిన తెలుగును గుర్తించడంలో తెలుగు రాష్ట్రాలు నిర్లక్ష్యం చేస్తున్నాయనే విమర్శలున్నాయి. తెలంగాణలో తెలుగు భాషకు ఓ మోస్తరు గుర్తింపు లభిస్తుండగా ఏపీలో మాత్రం కనుమరుగయ్యే స్థితికి చేరుకుంది.

Also Read: మోదీకి భారతరత్న ఇవ్వాలంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత..!

జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ప్రాథమిక పాఠశాలల్లో తెలుగు మీడియం చదువులకు స్వస్తి పలికేలా నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లీష్ మీడియం చదువులకు జగన్ సర్కార్ పెద్దపీఠ వేయడంతో పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు కోర్టులను ఆశ్రయించిన సంగతి తెల్సిందే.

ఇక త్వరలోనే పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు రానున్నాయి. బెంగాల్లో పాగా వేసేందుకు బీజేపీ పావులు కదుపుతుండగా వాటికి చెక్ పెట్టేలా సీఎం మమత బెనర్జీ ప్రతివ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. దీనిలో భాగంగా మమత సర్కార్ తెలుగువారిని ఆకట్టుకునేలా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Also Read: బీజేపీలో సీఎం ఫైట్: కిషన్ రెడ్డి వర్సెస్ బండి సంజయ్

బెంగాల్లో తెలుగును అధికారిక భాషగా గుర్తిస్తున్నట్లు సీఎం మమత బెనర్జీ ప్రకటించారు. పశ్చిమ బెంగాల్లో ఇప్పటికే అనేక భాషలకు అధికారిక గుర్తింపు ఉండగా తాజాగా తెలుగు భాష కూడా ఆ లిస్టులో చేరింది.

తెలుగు భాషను అధికారిక భాషగా గుర్తించడం ద్వారా మమత బెనర్జీ తెలుగువారికి సముచిత గౌరవం ఇచ్చిందనే టాక్ విన్పిస్తోంది. ఒకే ఒక్క నిర్ణయంతో మమత బెనర్జీ తెలుగు వారందరినీ తనవైపు తిప్పుకోవడంలో విజయం సాధించినట్లు కన్పిస్తోంది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్