Vijay Sethupathi: విదేశాల్లో రెండు దశాబ్దాల క్రితం మొదలైన బిగ్ బ్రదర్ అనే రియాలిటీ షో కాన్సెప్ట్ ని ఒడిసిపట్టుకుని ,మన ఇండియా లో బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) అనే రియాలిటీ షో ని బాలీవుడ్ లో పరిచయం చేశారు. మొదటి సీజన్ కి అమితాబ్ బచ్చన్, రెండవ సీజన్ కి శిల్ప శెట్టి వ్యవహరించగా, మూడవ సీజన్ నుండి ప్రస్తుతం నడుస్తున్న 19 వరకు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఈ షో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో కన్నడ, తెలుగు, మలయాళం మరియు తమిళ భాషల్లో కూడా ప్రారంభించారు. అన్ని భాషల్లోనూ పెద్ద హిట్ అయ్యింది. మన తెలుగు లో ఈ షో జూనియర్ ఎన్టీఆర్ తో మొదలైంది. మొదటి సీజన్ పెద్ద హిట్ అయ్యింది, రెండవ సీజన్ నేచురల్ స్టార్ నాని తో చేసారు, ఇది కూడా పెద్ద హిట్ అయ్యింది.
కానీ రెండవ సీజన్ కి తీవ్రమైన నెగిటివిటీ ఏర్పడడం తో నాని ఈ షో నుండి తప్పుకున్నాడు. ఇక మూడవ సీజన్ నుండి, ప్రస్తుతం నడుస్తున్న 9 వ సీజన్ వరకు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. అదే విధంగా తమిళం లో 7 సీజన్స్ కి కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు, 8 వ సీజన్ నుండి విజయ్ సేతుపతి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. కన్నడ లో కిచ్చ సుదీప్, మలయాళం లో మోహన్ లాల్ వంటి వారు ప్రస్తుతం ఈ రియాలిటీ షో కి వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నారు. వీరిలో ఎవరు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము. అందుతున్న సమాచారం ప్రకారం వీరిలో సల్మాన్ ఖాన్ అత్యధిక పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఒక్కో ఎపిసోడ్ కి ఆయన పది కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ని అందుకుంటాడట. ఇక ప్రస్తుతం నడుస్తున్న సీజన్ 19 మొత్తానికి కలిపి సల్మాన్ ఖాన్ 120 నుండి 150 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్నాడట.
ఇక ఆయన తర్వాతి స్థానం లో మన అక్కినేని నాగార్జున నిలిచాడు . సీజన్ 9 మొత్తానికి కలిపి ఆయన 50 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. అంతే కాదు, బిగ్ బాస్ సెట్స్ ని అన్నపూర్ణ స్టూడియోస్ లోనే వేశారు. అందుకు గాను నాగార్జున రెంట్స్ రూపం లో భారీగానే వసూలు చేస్తున్నాడట నాగార్జున. ఇక ఆ తర్వాతి స్థానాల్లో విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్ నిల్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరికి దాదాపుగా ప్రస్తుతం సీజన్స్ కి 40 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్స్ ని అందుకుంటున్నారట. హోస్టులు ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్స్ అందుకుంటున్నారంటే, ఈ షో ద్వారా ఎంత ఆదాయం వస్తుందో ఊహించుకోవచ్చు.