Kantara 2 Collection Day 5: భారీ అంచనాల నడుమ విడుదలైన ‘కాంతారా 2′(Kantara : The Chapter 1) చిత్రం విజయవంతంగా థియేటర్స్ లో ప్రదర్శితమవుతోంది. సినిమాకు పాజిటివ్ టాక్ అయితే బలంగా వచ్చింది కానీ, కర్ణాటక తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఆశించిన స్థాయి థియేట్రికల్ రన్ ని సొంతం చేసుకోలేకపోతుంది ఈ చిత్రం. నార్త్ ఇండియా లో వీకెండ్ తో పోలిస్తే 70 శాతం కి పైగా నష్టాలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి. సోమవారం రోజున 4 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లు వచ్చాయి. ఇది డీసెంట్ అయినప్పటికీ కూడా బ్రేక్ ఈవెన్ అందుకోవడానికి ఏ మాత్రం సరిపోదు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 95 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకుంది ఈ చిత్రం. 5 రోజుల్లో ఎంత వసూళ్లను రాబట్టింది?, బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఇంకా ఎంత వసూళ్లు రావాలి అనేది వివరంగా చూద్దాం.
మొదటి రోజు తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 10 కోట్ల 80 లక్షలు రాగా, రెండవ రోజున 10 కోట్ల 22 లక్షలు, మూడవ రోజున 9 కోట్ల 6 లక్షలు, నాల్గవ రోజున 9 కోట్ల 36 లక్షలు, ఐదవ రోజున 4 కోట్ల 5 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. నైజాం ప్రాంతం లో దాదాపుగా 19 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. నేటితో 20 కోట్ల రూపాయిల మార్కుని అందుకోనుంది ఈ చిత్రం. అదే విధంగా సీడెడ్ లో 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఉత్తరాంధ్ర లో 6 కోట్ల రూపాయిలు, తూర్పు గోదావరి జిల్లాలో 2 కోట్ల 50 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో కోటి 68 లక్షలు, గుంటూరు జిల్లాలో 2 కోట్ల 42 లక్షలు, కృష్ణ జిల్లాలో 2 కోట్ల 90 లక్షలు, నెల్లూరు జిల్లాలో కోటి 28 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా 43 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల నుండి రాబట్టింది.
బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే ఇంకా 47 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను అందుకోవాల్సి ఉంటుంది. ఆ రేంజ్ వసూళ్లు రావాలంటే ఈ చిత్రం దీపావళి వరకు నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ పరిస్థితి చూస్తే అప్పటి వరకు నిలబడడం అనుమానమే అని చెప్పొచ్చు. నేడు నైజాం తో పాటు, అన్ని ప్రాంతాల్లో కూడా ఈ సినిమా బాగా డౌన్ అయిపోయింది. పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఒక పాన్ ఇండియన్ క్రేజీ మూవీ సీక్వెల్ ఇలా పడిపోతుందని ట్రేడ్ విశ్లేషకులు కూడా అంచనా వేయలేకపోయారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎంత వరకు వెళ్తుంది అనేది.