spot_img
Homeఎంటర్టైన్మెంట్Vijay Deverakonda: విజయ్ దేవరకొండ దైర్యం ఏంటి..? టైర్ వన్ హీరో అవ్వకపోతే కష్టమేనా..?

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ దైర్యం ఏంటి..? టైర్ వన్ హీరో అవ్వకపోతే కష్టమేనా..?

Vijay Deverakonda: ‘పెళ్లిచూపులు’ సినిమాతో హీరోగా పరిచయమైన విజయ్ దేవరకొండ చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. టైర్ వన్ హీరోగా మారతాడని అందరు అనుకున్నప్పటికి ఆయన చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవడంతో టైర్ వన్ పొజిషన్ ని దక్కించుకోలేకపోయాడు. ప్రస్తుతం ఆయన రెండు మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. ఆయన చాలా బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. గత సంవత్సరం విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన కింగ్ డమ్ సినిమా పాన్ ఇండియాలో రిలీజ్ అయింది. ఈ మూవీ భారీ విజయాన్ని సాధిస్తుందని అందరు అనుకున్నారు. కానీ అందరికి షాకిస్తూ ఈ సినిమా ఫ్లాప్ గా మారింది. ఇక ఇలాంటి క్రమంలోనే విజయ్ దేవరకొండ మార్కెట్ చాలా తక్కువగా ఉన్నప్పటికి అతని మీద భారీ బడ్జెట్ ను ఎందుకు కేటాయిస్తున్నారు. దానివల్ల వచ్చే లాభాలు ఏంటి అంటూ చాలామంది సినిమా మేధావులు సైతం కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: నాయకుడంటే ఇలానే ఉండాలనే రీతిలో లోకేష్.. నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

ప్రస్తుతం రౌడీ జనార్ధన్, రణబాలి సినిమాలు బడ్జెట్ సైతం విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇక ఈ రెండు సినిమాలు సక్సెస్ ఫుల్ గా నిలిస్తే తప్పులేదు. కానీ డిజాస్టర్లు అయితేనే ప్రొడ్యూసర్లు భారీగా నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఇప్పటికి విజయ్ దేవరకొండ ధైర్యం ఏంటి ఎందుకని ఆయన తనకు నచ్చినట్టుగా మాట్లాడుతాడు.

దానివల్ల ఆయన తన మార్కెట్ ను కూడా కోల్పోతున్నాడనే విషయం తనకు తెలియడం లేదని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి విజయ్ దేవరకొండ అంటే చాలామందికి ఇష్టం ఉన్నప్పటికి ఆయన మాట్లాడే మాట తీరుని చూసి చాలామంది అతనికి డిస్కనెక్ట్ అయిపోతున్నారు… ప్రస్తుతం చాలామంది హీరోలు లోపల ఒకటి ఉంచుకుని బయటికి మాత్రం మరొకటి మాట్లాడుతుంటారు. కానీ విజయ్ మాత్రం ఏది అనిపిస్తే అది చెబుతున్నాడు.

అలా చెప్పడం వల్ల చాలామంది అభిమానులను కోల్పోయే అవకాశమైతే ఉంది…తను టైర్ వన్ హీరో అవ్వాలంటే ప్రేక్షకుల ముందు నటించాలి. వాళ్లే తనకి దైవం అని చెప్పాలి. ఇతర హీరోల మీద కామెంట్స్ చెయ్యకూడదు… ఇవన్నీ చేస్తూ మంచి సినిమాలు చేస్తే విజయ్ టైర్ వన్ హీరోగా మారిపోతాడు. చూడాలి మరి ఫ్యూచర్ లో అయిన తను తన వైఖరిని మార్చుకుంటాడా? లేదా అనేది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular