Vijay Deverakonda Responce: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని యూత్ ఆడియన్స్ లో ఏర్పాటు చేసుకున్న హీరోలలో ఒకరు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda). అప్పట్లో పవన్ కళ్యాణ్ కి యూత్ ఆడియన్స్ ఎలా అయితే ఆకర్షితులు అయ్యారో, ఇప్పటి యూత్ ఆడియన్స్ కూడా అదే తరహా లో విజయ్ దేవరకొండ పైకి ఆకర్షితులు అయ్యారు. ఇప్పటి వరకు ఆయన దాదాపుగా 9 సినిమాలు చేసి ఉంటాడు. అందులో కేవలం మూడు చిత్రాలు మినహా, మిగిలిన సినిమాలన్నీ ఫ్లాపులే, అయినప్పటికీ కూడా ఇంత క్రేజ్ ఉండడం ఏంటో అని ఆడియన్స్ కి కూడా అంతు చిక్కని ప్రశ్న. సినిమాలు మాత్రమే కాకుండా, విజయ్ దేవరకొండ బయట ఇచ్చే ప్రసంగాలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. బహుశా అందువల్లనే ఏమో ఆయనకు స్పెషల్ క్రేజ్. అయితే బయట ఆయన చేసే ప్రసంగాలు ఎంత క్రేజ్ ని తెచ్చిపెట్టాయో, అంతే నెగిటివిటీ ని కూడా తెచ్చిపెట్టింది.
Also Read: కింగ్డమ్ మూవీ ఓవర్సీస్ రివ్యూ వచ్చేసింది..సినిమా పరిస్థితి ఏంటంటే?
రేపు ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కింగ్డమ్'(Kingdom Movie) విడుదల అవ్వబోతున్న సందర్భంగా మేకర్స్ నేడు ఒక ప్రెస్ మీట్ ని నిర్వహించారు. ఈ ఈవెంట్ లో విలేఖరులు విజయ్ దేవరకొండ ని అడిగిన పలు ప్రశ్నలు, అందుకు ఆయన ఇచ్చిన సమాదానాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఒక విలేఖరి విజయ్ ని ఒక ప్రశ్న అడుగుతూ ‘ఇంతకు ముందు మీ మాటల్లో చాలా యాటిట్యూడ్ కనిపించేది. కానీ ఇప్పుడు చాలా పద్దతిగా మాట్లాడుతున్నారు. ఈ అనూహ్యమైన మార్పుకు కారణం ఏంటి?’ అని అడుగుతారు. దానికి విజయ్ దేవరకొండ సమాధానం చెప్తూ ‘నేను ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే నా మనసుకి ఏది అనిపిస్తే అదే మాట్లాడుతాను. ఈరోజు నాకు ఇలా మాట్లాడాలని అనిపించింది, అందుకే అలా మాట్లాడుతున్నాను’.
Also Read: ప్రీమియర్ షో ల వల్లనే సినిమాలకు కలెక్షన్స్ తగ్గుతున్నాయా..? అసలేం జరుగుతోంది..?
‘నన్ను ఎవరూ తక్కువ చేసి చూడకూడదు, మాట్లాడకూడదు, నన్ను నేను రక్షించుకోవాలి, నేను అనుకున్నది సాదించాలి, అంతే కానీ ఎవరో ఎదో అనుకోవాలి, వాళ్ళ ప్రశంసలు అందుకోవాలి అని నేను ఏ పని చేయను. ఇలాంటి ఆలోచనలతో ఉన్నాను కాబట్టే కెరీర్ ప్రారంభం లో నేను మీ అందరికి దూకుడుతో ఉన్నానని అనిపించి ఉండొచ్చు. సినిమాల్లో కూడా మనం ఇలాంటివి చూస్తూనే ఉందాం. మొదట్లో హీరో పవర్ ఫుల్ గా ఉంటాడు, కానీ ఆ తర్వాత అమ్మ వల్లనో, భార్య వల్లనో మారిపోతూ ఉంటాడు, నేను కూడా అలాగే అనుకోండి’ అని అంటాడు. ఇంత మెచ్యూరిటీ కింగ్డమ్ సినిమా వల్ల వచ్చిందా అని రిపోర్టర్ అడగ్గా, దానికి విజయ్ దేవరకొండ సమాధానం చెప్తూ ‘నా వయస్సు కూడా పెరుగుతుంది కదా’ అంటూ చెప్పుకొచ్చాడు. విజయ్ దేవరకొండ ఇలా మాట్లాడడంతో, సోషల్ మీడియా లో నెటిజెన్స్ ‘ఏమైంది మనోడికి..రష్మిక వచ్చిన తర్వాత బాగా మారిపోయినట్టు ఉన్నాడే..జీవితం మీద వైరాగ్యం కలిగిందా?’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.