Kingdom Movie Review: విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరో గా నటించిన ‘కింగ్డమ్'(Kingdom Movie) చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ తెలుగు, హిందీ, తమిళం మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మూవీ టీం నేడు ఫైనల్ ప్రమోషనల్ ఈవెంట్ గా కాసేపటి క్రితమే ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. మూవీ టీం మొత్తం కచ్చితంగా ఈ చిత్రం భారీ హిట్ అవుతుంది అనే బలమైన నమ్మకం తో ఉన్నారు. విజయ్ దేవరకొండ ఈ సినిమా హిట్ అయితే నేను ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్లి కూర్చుంటాను అంటూ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో గొంతు చించుకొని మరీ చెప్పాడు. చూస్తుంటే సినిమా ఔట్పుట్ అద్భుతంగా వచ్చింది అనే ఆనందం హీరో తో పాటు, మూవీ టీం మొత్తం లో ఉంది అనే వాళ్ళ మాటల్లోనే తెలుస్తుంది.
Read Also: కింగ్డమ్ లో ఈ రెండు సన్నివేశాలు.. సినిమాను ఏం చేస్తాయి..?
అయితే కాసేపటి క్రితమే లండన్ లో ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. అక్కడ నుండి వచ్చిన సెన్సార్ రిపోర్ట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆ రిపోర్టు ఎలా ఉందో చూద్దాం. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం గౌతమ్ తిన్ననూరి స్టైల్ లో చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే లో సాగుతుందట. కానీ సెకండ్ హాఫ్ మాత్రం కాస్త స్లో స్క్రీన్ ప్లే తో నడుస్తుందని, మేకర్స్ అందుకే విడుదలకు ముందు అన్నిసార్లు రీ షూట్ చేశారని, రీ షూట్ చేసినప్పటికీ సెకండ్ హాఫ్ చాలా సన్నివేశాలు ల్యాగ్ అనిపిస్తాయని అంటున్నారు. ఓవరాల్ గా సినిమా యావరేజ్ రేంజ్ రిపోర్ట్స్ ని సొంతం చేసుకుంటుంది. ఇది కేవలం అక్కడి సెన్సార్ సభ్యుల అభిప్రాయం మాత్రమే. సినిమా విడుదల అయ్యాక ఆడియన్స్ రిపోర్ట్ అలా ఉండకపోవచ్చు.
Read More: కింగ్డమ్’ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్ల గ్రాస్ రావాలో తెలుసా..?
సూపర్ హిట్ టాక్ రావొచ్చు, బ్లాక్ బస్టర్ టాక్ రావొచ్చు, డిజాస్టర్ టాక్ కూడా రావొచ్చు. కానీ ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పగలం, విజయ్ దేవరకొండ గత సినిమాలతో పోలిస్తే కచ్చితంగా ఈ చిత్రం బాగుంటుంది అట. అంటే మినిమం గ్యారంటీ హిట్ అన్నమాట. రౌడీ బాయ్ ఈ సినిమాతో సాధారణమైనంత వరకు సేఫ్ అయ్యినట్టే. ఈ చిత్రం రివెంజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిందని, ప్రముఖ యంగ్ హీరో సత్యదేవ్ ఇందులో విజయ్ దేవరకొండ కి అన్నయ్య నటించాడు. ఇందులో ఆయన చనిపోతాడు అనే టాక్ కూడా ఉంది. ట్రైలర్ లో హీరో అన్నయ్య ని క్రిమినల్ గా చూపించారు. మరి నిజంగా క్రిమినల్ నా?, లేకపోతే ఎవరైనా కుట్ర చేసి కావాలని తన అన్నయ్య ని ఇరికించారా? ఇలాంటి ప్రశ్నలకు సమాదానాలు మరికొద్ది గంటల్లో తెలియనున్నాయి.