Srilanka Cricket Trending Video: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ప్రపంచంలో ఫుట్ బాల్ తర్వాత ఎక్కువమంది చూస్తున్న గేమ్. దీని ఆధారంగా వేలకోట్ల వ్యాపారం సాగుతున్న గేమ్. అటువంటి ఆట అద్భుతంగా ఉండాలి. చూసే ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగించాలి. అంతకంతకు ఏం జరుగుతుందని ఉత్సుకతను రేపాలి. అప్పుడే ఆట అద్భుతంగా ఉంటుంది. ఆటగాళ్లకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడానికి దోహదపడుతుంది. అలాకాకుండా క్రికెట్ గేమ్ ను వేరే విధంగా ఆడితే.. ఆటగాళ్లు ప్రొఫెషనలిజాన్ని పక్కన పెడితే.. అసలుకే మోసం వస్తుంది.. అలాంటిదే ఒకటి జరిగింది.
Also Read: గౌతమ్ గంభీర్ ఉగ్రరూపం.. బిత్తర పోయిన పిచ్ క్యూరేటర్.. వైరల్ వీడియో
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో ప్రకారం.. శ్రీలంకలో క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నది. బౌలర్ బంతి వేశాడు. దాన్ని కొట్టడానికి బ్యాటర్ శతవిధాలుగా ప్రయత్నాలు చేశాడు. బంతి కీపర్ చేతిలో నుంచి మిస్ అయింది. ఆ తర్వాత నాన్ స్ట్రైకర్ పరుగు కోసం వచ్చాడు. దాదాపు మిడిల్ పిచ్ దాటాడు. ఈలోగా స్ట్రైకర్ పరుగు మొదలు పెట్టాడు. వారిద్దరూ ఊహించని స్థాయిలో పరుగులు తీశారు. మధ్యలో ఫీల్డర్ల నిర్లక్ష్యం వల్ల బంతి చేతులు మారింది. ఫలితంగా బ్యాటింగ్ చేసే జట్టుకు ధారాళంగా పరుగులు వచ్చాయి. చూస్తుండగానే స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది.
Also Read: చివరి టెస్టులో మేనేజ్మెంట్ ప్రయోగాలు.. వారిద్దరికీ చోటు..
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. వాస్తవానికి ఇలాంటి ఆట ఇంతవరకు చూడలేదని నెటిజన్లు అంటున్నారు. అసలు బంతి పట్టుకోవడానికి కూడా ఫీల్డర్లకు అంత బద్ధకం ఏంటని ప్రశ్నిస్తున్నారు..” ఇది చూడబోతే కావాలని చేసినట్టు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో వ్యూస్ పెంచుకోవడానికి చేసిన ప్రయోగంలాగా అనిపిస్తోంది. లేకపోతే ప్రొఫెషనల్ ఆటగాళ్లు ఇలా చేయడం ఏంటి.. కనీసం బంతిని పట్టుకోడానికి కూడా ఫీల్డర్లకు ఇష్టం ఉండదా? బంతిని ఎలా పడితే అలా వేస్తారా? కనీసం అవగాహన లేకుండా ఇలా క్రికెట్ ఎలా ఆడతారు. ఒక ఆటగాడిని రన్ అవుట్ చేయడానికి ఇన్ని విన్యాసాలు చేస్తారా” నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు.
Meanwhile in Sri Lanka pic.twitter.com/CCHcldW23Y
— Nibraz Ramzan (@nibraz88cricket) July 29, 2025