Homeఎంటర్టైన్మెంట్Vijay Deverakonda Rashmika Mandanna Marriage: హీరో అర్జున్ కూతురు కారణంగానే విజయ్ దేవరకొండ ,...

Vijay Deverakonda Rashmika Mandanna Marriage: హీరో అర్జున్ కూతురు కారణంగానే విజయ్ దేవరకొండ , రష్మిక పెళ్లి జరిగిందా..? బయటపడ్డ షాకింగ్ నిజం!

Vijay Deverakonda Rashmika Mandanna Marriage: రీసెంట్ గానే విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక(Rashmika Mandanna) జంట పెళ్లి ఎంత గ్రాండ్ గా జరిగిందో మనమంతా చూశాము. ఇప్పటికీ ఈ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో తిరుగుతూనే ఉన్నాయి. చూడముచ్చటగా అనిపించే ఈ జంట , మొట్టమొదటిసారి కలిసింది ‘గీత గోవిందం’ చిత్రం కోసం అనే సంగతి మన అందరికీ తెలిసిందే . అల్లు అరవింద్ నిర్మాతగా , గీత ఆర్ట్స్ బ్యానర్ లో , పరశురామ్ పెట్ల దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ఆరోజుల్లో ఒక హిస్టరీ క్రియేట్ చేసింది. ఆరోజుల్లోనే ఈ చిత్రం 130 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు, 75 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. మీడియం రేంజ్ హీరోలు ఇప్పటి వరకు ఎన్నో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు, కానీ ఒక్కరు కూడా ‘గీతా గోవిందం’ కలెక్షన్స్ కి దగ్గర్లోకి కూడా వెళ్లలేకపోయారు.

Also Read: మంచు విష్ణు ఆ ఒక్క సినిమా నాకోసం వదిలేయమని ప్రభాస్ ను అడిగాడా..? ఆ సినిమా ఏంటంటే..?

దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు, ఆ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అనేది. ఈ సినిమా అటు విజయ్ దేవరకొండ కెరీర్ ని , ఇటు రష్మిక కెరీర్ ని మార్చేసింది. కానీ దురదృష్టం కొద్దీ ఈ చిత్రం తర్వాత విజయ్ ఆ స్థాయి హిట్స్ ని అందుకోలేకపోయారు, రష్మిక మాత్రం పాన్ ఇండియా లెవెల్ లో ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ ని అందుకొని పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా స్థిరపడింది. వీళ్లిద్దరి మధ్య పరిచయం ఏర్పడి , అది ప్రేమ వరకు దారి తీసి, నేడు పెళ్లి చేసుకునే స్టేజికి తీసుకొచ్చిన సినిమా కూడా ఇదే. ఒక్కసారి వీళ్లిద్దరి కెరీర్ లో ఈ చిత్రాన్ని తీసేసి చూడండి . ఈ సినిమా లేకపోతే వీళ్ళ మధ్య అసలు పరిచయం కూడా ఏర్పడేది కాదేమో.

అయితే ఈ వీళ్లిద్దరు ఇలా కలవడానికి కారణం యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య అని తెలుస్తోంది. రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘ నేను వదులుకున్న అనేక సూపర్ హిట్ చిత్రాల్లో గీత గోవిందం చిత్రం కూడా ఒకటి. ముందుగా హీరోయిన్ పాత్ర కోసం నన్నే అడిగారు. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల చెయ్యలేకపోయాను. ఒకవేళ చేసుంటే ఈరోజు నా కెరీర్ వేరేలా ఉండేది’ అంటూ చెప్పుకొచ్చింది. రీసెంట్ గానే ఈమె ‘సీతా పయనం’ అనే చిత్రం ద్వారా మన టాలీవుడ్ ఆడియన్స్ ముందుకు వచ్చింది. అర్జున్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కమర్షియల్ గా చాలా పెద్ద ఫ్లాప్ అయ్యింది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular