Homeఎంటర్టైన్మెంట్Sree Vishnu Mrityunjay First Day Collections: 'మృత్యుంజయ్' మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.....

Sree Vishnu Mrityunjay First Day Collections: ‘మృత్యుంజయ్’ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. సైలెంట్ గా వచ్చి దుమ్ము లేపేసిన శ్రీ విష్ణు !

Sree Vishnu Mrityunjay First Day Collections: శ్రీ విష్ణు(Sree Vishnu) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మృత్యుంజయ్'(Mrityunjay Movie) ఎలాంటి చప్పుడు లేకుండా నిన్న విడుదలై ఆడియన్స్ లో మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని ప్రపంచవ్యాప్తంగా డీసెంట్ స్థాయి ఓపెనింగ్స్ రాబట్టింది. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి మొదటి రోజున 15 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇక నేడు నిన్నటి కంటే భారీ స్థాయిలో టికెట్స్ […]

Sree Vishnu Mrityunjay First Day Collections: శ్రీ విష్ణు(Sree Vishnu) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మృత్యుంజయ్'(Mrityunjay Movie) ఎలాంటి చప్పుడు లేకుండా నిన్న విడుదలై ఆడియన్స్ లో మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని ప్రపంచవ్యాప్తంగా డీసెంట్ స్థాయి ఓపెనింగ్స్ రాబట్టింది. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి మొదటి రోజున 15 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇక నేడు నిన్నటి కంటే భారీ స్థాయిలో టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ప్రస్తుతం బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు వెయ్యి కి పైగా టికెట్స్ సేల్ అవుతున్నాయి. విడుదలకు ముందు ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 6 కోట్ల 50 లక్షల రూపాయలకు జరిగింది. మొదటి రోజు వచ్చిన వసూళ్లు చూస్తుంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం పెద్ద కష్టం ఏమి కాదనిపిస్తోంది.

Also Read: మంచు విష్ణు ఆ ఒక్క సినిమా నాకోసం వదిలేయమని ప్రభాస్ ను అడిగాడా..? ఆ సినిమా ఏంటంటే..?

ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే ఈ చిత్రానికి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల నుండి 90 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 1 కోటి 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా, చాలా సైలెంట్ గా విడుదలై ఈ రేంజ్ వసూళ్లను రాబట్టడం అనేది చిన్న విషయం కాదు. పైగా శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘విష్ణు విన్యాసం’ చిత్రం గత వారం విడుదలై దాదాపుగా 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇంకో కోటి రూపాయిలు వస్తే ఆ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని కూడా అందుకుంటుంది. వారం క్రితమే ఒక సూపర్ హిట్ ని అందుకొని, పక్క వారం లో అదే హీరోకి సంబంధించిన మరో సినిమా వచ్చి , ఇది కూడా సూపర్ హిట్ వైపు అడుగులు వేయడం అనేది చాలా అరుదైన సంఘటన.

ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ని చూస్తుంటే ఈ చిత్రానికి మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లు వచ్చేలా ఉన్నాయని అంటున్నారు. మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా 1 కోటి 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వస్తే, రెండవ రోజున కేవలం తెలుగు రాష్ట్రాల నుండి 1 కోటి 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా రెండవ రోజు ఈ చిత్రానికి 1 కోటి 60 లక్షల వరకు రావొచ్చని అంటున్నారు. అలా మొదటి మూడు రోజులకు కలిపి 4 కోట్ల రూపాయిల నుండి 5 కోట్ల రూపాయిల మధ్యలో షేర్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరి ఇది ఎంత వరకు నిజం అవ్వబోతుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper