Vijay Deverakonda Rashmika conditions: విజయ్ దేవరకొండ ప్రస్తుతం అటు ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే సినిమా షూటింగ్స్ లో కూడా పాల్గొంటున్నారు. వరుసగా రెండు సినిమాలను ఒకేసారి షూట్ చేస్తున్న ఆయన ఈ సినిమాలతో పెను ప్రభంజనాలను సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. రెండు మూవీస్ రెండు డిఫరెంట్ జానర్స్ లో తెరకెక్కుతుండటం విశేషం… ఈ రెండింటిలో కూడా ఆయన చాలా వైల్డ్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే ఈ సినిమాలతో అతనికి ఎలాంటి ఇమేజ్ ను సంపాదించి పెడతాయి. తద్వారా ఆయన మార్కెట్ మరింత పెరుగుతుందా? లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.
మొత్తానికైతే విజయ్ దేవరకొండ రష్మికను పెళ్లి చేసుకొని చాలా మంచి పని చేశాడంటూ చాలామంది అతని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య చాలా మంచి అండర్స్టాండింగ్ ఉందని అందువల్లే వాళ్ళు సినిమాల్లో సైతం రాణించగలుగుతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి విజయ్ దేవరకొండ ఇప్పటికే రష్మిక మందానికి కొన్ని కండిషన్స్ పెట్టాడట.
Also Read: ఇన్ స్టాగ్రామ్ లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా..వైరల్ అవుతున్న మొదటి పోస్ట్!
ఇక వీలైనంత తొందరగా ఆమె ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలన్నింటిని పూర్తి చేసి తర్వాత మంచి క్యారెక్టర్ దొరికితే సినిమాలు చేయమని లేకపోతే బిజినెస్ చూసుకోమని విజయ్ రష్మిక కి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం పాన్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకున్నా రష్మిక మందాన విజయ్ చెప్పినట్టుగా వింటుందా లేదంటే మరికొన్ని డిఫెంట్ సినిమాలను చేస్తానని చెబుతుందా అనేది తెలియాల్సి ఉంది.
ప్రస్తుతానికైతే విజయ్ కండిషన్స్ కి తను ఒప్పుకుందట. కానీ ఫ్యూచర్లో భారీ సక్సెస్ లను సాధించే సినిమాలు చేసిన తర్వాత ఆమెకు రెమ్యునరేషన్ విషయంలో కానీ క్రేజ్ విషయంలో కానీ మరింత పాపులారిటి వస్తే ఆమె మరి కొన్ని సినిమాలను చేసే అవకాశాలు ఉన్నాయా అనే ధోరణిలో కూడా కొన్ని వార్తలైతే వస్తున్నాయి… ఇక ముందు కూడా విజయ్ రష్మిక ఒకరి నిర్ణయాలను మరొకరు గౌరవిస్తూ ఆదర్శ దంపతులుగా నిలుస్తారా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
