Homeఎంటర్టైన్మెంట్Anna Lezhneva Instagram debut: ఇన్ స్టాగ్రామ్ లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా...

Anna Lezhneva Instagram debut: ఇన్ స్టాగ్రామ్ లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా..వైరల్ అవుతున్న మొదటి పోస్ట్!

Anna Lezhneva Instagram debut: ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) సతీమణి కూడా ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లోకి అడుగుపెట్టేసింది. కాసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ ఈ విషయాన్నీ తెలుపుతూ ఆమెకు స్వాగతం చెప్తూ ఒక పోస్ట్ వేశాడు. ఆయన మాట్లాడుతూ ‘అన్నా లెజినోవా’ కి మనస్ఫూర్తిగా ఇన్ స్టాగ్రామ్ లోకి స్వాగతం పలుకుతున్నాను. ఈ స్పేస్ లోకి వచ్చినందుకు మీకు ఆల్ ది బెస్ట్. రాబోయే రోజుల్లో నీ […]

Anna Lezhneva Instagram debut: ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) సతీమణి కూడా ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లోకి అడుగుపెట్టేసింది. కాసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ ఈ విషయాన్నీ తెలుపుతూ ఆమెకు స్వాగతం చెప్తూ ఒక పోస్ట్ వేశాడు. ఆయన మాట్లాడుతూ ‘అన్నా లెజినోవా’ కి మనస్ఫూర్తిగా ఇన్ స్టాగ్రామ్ లోకి స్వాగతం పలుకుతున్నాను. ఈ స్పేస్ లోకి వచ్చినందుకు మీకు ఆల్ ది బెస్ట్. రాబోయే రోజుల్లో నీ విలువైన ఆలోచనలను ఈ స్పేస్ ద్వారా ఎలా పంచుకోబోతున్నావో తెలుసుకోవాలని నాకు కూడా కుతూహలంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. ఆయన ఈ పోస్ట్ వెయ్యగానే అన్నా లెజినోవాకి అప్పుడే 68 వేలమంది ఫాలవర్లు వచ్చేశారు. 24 గంటలోపు 1 మిలియన్ కి పైగా ఫాలోవర్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇకపోతే ఆమె అప్లోడ్ చేసిన మొదటి పోస్టు కూడా చాలా ఆసక్తికరంగా ఉంది.

తనతో పాటు పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి అరుదైన ఫోటో ని ఒకటి అభిమానులతో పంచుకుంటూ ‘చాలా కాలం నుండి ఇన్ స్టాగ్రామ్ లోకి అడుగుపెట్టాలని చూస్తున్నాను. ఇదే సరైన సమయం అనిపించింది. మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులతో , పవన్ కళ్యాణ్ సపోర్టు తో మీ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది. ఇన్ స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన కుటుంబ సభ్యులతో పాటు, ఇతర సెలబ్రిటీలను కూడా ఈమె అనుసరించింది. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ , సమంత, అలియా భట్ వంటి వారు కూడా ఉన్నారు. వీళ్లంతా అన్నా లెజినోవా కి మొదటి నుండి బాగా దగ్గరైన మనుషులు. పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు బాహ్య ప్రపంచానికి వీళ్ళు కలిసిన సందర్భాలు చాలా తక్కువ అని అనిపిస్తాయి కానీ, నిజ జీవితం లో వీళ్లిద్దరు మంచి స్నేహితులు.

వీళ్లిద్దరి కుటుంబాలు సందర్భం వచ్చినప్పుడల్లా కలుస్తూనే ఉంటాయి. ఇక సమంత తో కూడా అన్నా లెజినోవా కి మొదటి నుండి వ్యక్తిగత సాన్నిహిత్యం ఉండదట. మొత్తం మీద ఒక 35 మందిని ఫాలో అయ్యింది. అయితే ఈమె ఎంత వరకు యాక్టీవ్ గా ఉండబోతుందో చూడాలి. పవన్ కళ్యాణ్ అభిమానులు మార్క్ శంకర్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఈమె అప్లోడ్ చేస్తే చూడాలని చాలా కోరికతో ఉన్నారు. కేవలం ఒకటి రెండు సందర్భాల్లో తప్ప , ఇప్పటి వరకు మార్క్ శంకర్ ని బయట అభిమానులు పెద్దగా చూడలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో కచ్చితంగా మార్క్ శంకర్ ని చూసే అవకాశం ఉంటుందని అంటున్నారు అభిమానులు. ఆమె మొదటి ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ని మీ కోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

 

View this post on Instagram

 

A post shared by Anna Konidala (@anna.konidala)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper