Vijay Deverakonda And Rashmika Mandanna: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి కేవలం రెండు మూడు సినిమాలతోనే స్టార్ హీరో రేంజ్ స్టేటస్ ని సొంతం చేసుకున్న హీరోలలో ఒకరు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda). అర్జున్ రెడ్డి చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్న ఆయన, ఆ తారట వెంటనే ‘గీత గోవిందం’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని అందుకొని నేటి తరం యూత్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నాడు. కానీ ఇక్కడి నుండే ఆయనకు కష్టాలు మొదలయ్యాయి. ‘గీత గోవిందం’ తర్వాత ఆయన చేసిన చిత్రాల్లో కేవలం ‘టాక్సీ వాలా’ ఒక్కటే యావరేజ్ రేంజ్ లో ఆడింది. మిగిలిన సినిమాలన్నీ ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన ‘కింగ్డమ్’ కూడా కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది.
Also Read: రవితేజ రూటు మార్చాడా..? ఈ మార్పుకు కారణం ఏంటి..?
బాగా గమనిస్తే విజయ్ దేవరకొండ జీవితం లోకి రష్మిక(Rashmika Mandanna) వచ్చినప్పటి నుండే ఆయనకు వరుసగా ఫ్లాపుల మీద ఫ్లాపులు వస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ‘గీత గోవిందం’ సమయం లో వీళ్లిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అలా బెస్ట్ ఫ్రెండ్స్ అయిన వీళ్లిద్దరు కలిసి ‘డియర్ కామ్రేడ్’ అనే చిత్రం లో రెండోసారి నటించారు. ఈ సినిమా నుండే వీళ్లిద్దరి మధ్య ప్రేమ మొదలైందని, అది ఇప్పుడు పెళ్లి వరకు దారి తీసిందని అంటున్నారు. విజయ్ దేవరకొండ జీవితంలోకి రావడం వల్ల, రష్మిక కి అద్భుతంగా కలిసొచ్చింది. ఈయనతో ప్రేమలో ఉన్నప్పుడే రష్మిక కి పుష్ప, యానిమల్, పుష్ప 2 ,చావా వంటి వరుస పాన్ ఇండియన్ బ్లాక్ బూస్ట్ హిట్స్ వచ్చాయి. రీసెంట్ గా ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే చిత్రం కూడా కమర్షియల్ గా పెద్ద సక్సెస్ అయ్యింది.
కానీ విజయ్ దేవరకొండ కి ‘గీత గోవిందం’ తర్వాత నోటా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఖుషి, ది ఫ్యామిలీ స్టార్ మరియు కింగ్డమ్ వంటి డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. కెరీర్ లో మంచి రేంజ్ కి వెళ్ళిపోతాడు అని అనుకుంటున్నా సమయం లో వరుసగా 7 డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు రావడం సాధారణమైన విషయం కాదు. విజయ్ దేవరకొండ కి దురదృష్టం మామూలు రేంజ్ లో లేనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన ‘శ్యామ్ సింగ రాయ్’ ఫేమ్ రాహుల్ సంక్రుత్యాన్ దర్శకత్వంలో ఒక పీరియడ్ చిత్రం చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల కాబోతోంది. కనీసం ఈ సినిమాతో అయినా ఆయన భారీ కం బ్యాక్ ఇస్తాడని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి ఏమి జరగబోతోంది అనేది.