Vijay Deverakonda And Rashmika Wedding: గత రెండు మూడేళ్ళ నుండి సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక(Rashmika Mandanna) డేటింగ్ గురించి వరుసగా కథనాలు వినిపిస్తూనే ఉన్నాయి. వీళ్లిద్దరు కలిసి హైదరాబాద్ లో ఒకే ఇంట్లో ఉంటున్నారని, రష్మిక తన ప్రతీ షూటింగ్ కి హైదరాబాద్ లోని విజయ్ దేవరకొండ ఇంటి నుండే వెళ్తుందని, ఆయన కుటుంబ సభ్యులతో ఆమె బాగా కలిసిపోయిందని, ఇలా ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. కానీ వీళ్లిద్దరి నుండి మాత్రం ఇప్పటి వరకు మేము రిలేషన్ షిప్ లో ఉన్నామని ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అంతే కాకుండా రీసెంట్ గానే వీళ్లిద్దరికి రహస్యంగా కుటుంబ సభ్యుల సమక్ష్యంలో నిశ్చితార్థం కూడా జరిగిపోయింది అంటూ వార్తలు వినిపించాయి. ఇలాంటి వార్తలు విస్తృతంగా వినిపిస్తున్న ఈ సమయం లో వీళ్లిద్దరి పెళ్లి గురించి నేడు అధికారిక ప్రకటన స్వయంగా విజయ్ దేవరకొండ నోటి నుండి రానుందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read: రవితేజ రూటు మార్చాడా..? ఈ మార్పుకు కారణం ఏంటి..?
వివరాల్లోకి వెళ్తే రష్మిక ప్రధాన పాత్ర పోషించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ రీసెంట్ గానే ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా, బయ్యర్స్ కి భారీ లాభాలను తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమా సక్సెస్ మీట్ ని నేడు హైదరాబాద్ లో చేయబోతున్నారు మేకర్స్. ఈ సక్సెస్ మీట్ కి విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా రాబోతున్నాడట. రష్మిక సినిమా సక్సెస్ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ అతిథి అంటేనే ఆడియన్స్ అందరికీ అసలు విషయం ఏంటో పూర్తి గా క్లారిటీ వచ్చేసింది. ఇక ఇదే ఈవెంట్ లో వీళ్లిద్దరి పెళ్ళికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న టాక్. వీళ్లిద్దరి ఫ్యాన్స్ తో పాటు, ఆడియన్స్ కూడా ఈ ఈవెంట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే, వచ్చే ఏడాది ఫిబ్రవరి 26 న వీళ్లిద్దరి పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నాయట. అందుకోసం ఉదయ్ పూర్ ప్యాలస్ ని కూడా బుక్ చేసినట్టు తెలుస్తుంది. ఇక రష్మిక గర్ల్ ఫ్రెండ్ మూవీ విషయానికి వస్తే ఈ చిత్రం విడుదలైన 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కు ని పూర్తి గా అందుకొని క్లీన్ హిట్ గా నిలిచిందని అంటున్నారు. ముఖ్యంగా నార్త్ అమెరికా లో అయితే ఈ చిత్రం ఇప్పటి వరకు హాఫ్ మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ వీకెండ్ తో 1 మిలియన్ డాలర్ల గ్రాస్ మార్కుని కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయి.