Vijay Deverakonda: డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘లైగర్’ సినిమా చేస్తున్నాడు. కాగా ఈ పాన్ ఇండియా మూవీ షూటింగ్ కరోనా కారణంగా కొన్ని నెలలు వాయిదా పడింది. అయితే తాజాగా షూటింగ్ చివరి షెడ్యూల్ ప్రారంభమైనట్లు చిత్ర నిర్మాతల్లో ఒకరైన నటి ఛార్మి తెలిపింది. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ ను షూట్ చేస్తున్నారట. సినిమాలోనే ఈ సీక్వెన్స్ హైలైట్ గా ఉంటుందని తెలుస్తోంది.

పూరి ఈ సీక్వెన్స్ లో.. విజయ్ దేవరకొండను పక్కా బాక్సర్ గా భారీ బిల్డప్ తో చూపించబోతున్నాడు. పైగా ఈ ఫైట్ సినిమా కథనే మలుపు తిప్పుతుందని.. కీలకమైన ఎమోషనల్ సన్నివేశం కూడా ఈ ఫైట్ సీక్వెన్స్ లోనే ఉండబోతుందని.. అందుకే దాదాపు 3 కోట్లు ఖర్చు పెట్టి మరి ఈ సీక్వెన్స్ కోసం సెట్ కూడా వేశారని తెలుస్తోంది. కాగా వచ్చే నెలలో ఫస్ట్ వీక్ లోపు ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయాలని పూరి ప్లాన్ చేశాడట.
Also Read: ట్రైలర్ టాక్ : ‘గంగూభాయ్’లా అలియా అదరగొట్టింది.. ‘రోజు రాత్రి ఇజ్జత్ అమ్ముతాం’
నిజానికి ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ సినిమా షూటింగ్ గత రెండేళ్లుగా కరోనా కారణంగా పోస్ట్ ఫోన్ అవుతూనే వచ్చి.. ఎట్టకేలకు పూర్తి కావడానికి సన్నద్ధం అయింది. అందుకే.. ఈ సారి గ్యాప్ లేకుండా షూట్ చేస్తున్నాడు పూరి. అన్నట్టు విజయ్ దేవరకొండ ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. పైగా ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ కష్టపడి సిక్స్ ప్యాక్ చేశాడు. మరి ఆ కష్టానికి ఫలితం దక్కుతుందో లేదో చూడాలి.

అన్నిటికి మించి దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఎలాగూ చివరి దశ షూటింగ్ లో ‘లైగర్’ ఉంది కాబట్టి.. సినిమా ఫస్ట్ వెర్షన్ కూడా దాదాపు రెడీ అయింది. ఆ ఫస్ట్ వెర్షన్ ను చూసిన సినిమా టీమ్ లోని కొంతమంది సభ్యులు సినిమా అవుట్ ఫుట్ పై పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళంతా ఈ సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందని అంటున్నారు.
అందుకే, లైగర్ తర్వాత కూడా విజయ్ దేవరకొండ పూరితోనే మరో సినిమా చెయ్యాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. నిజానికి విజయ్ దేవరకొండ తన కెరీర్ లో కీలకమైన రెండేళ్ళ సమయాన్ని పూర్తిగా ‘లైగర్’ సినిమాకే కేటాయించాడు. ఇప్పుడు పూరి కోసం మరో రెండేళ్లు టైమ్ కేటాయిస్తాడట. ఇక ‘లైగర్’ ఆగస్టు 25న రిలీజ్ కానుంది. బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్, ఛార్మి, పూరి జగన్నాథ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Also Read: బాయ్స్ హాస్టల్‌లో అమ్మాయి.. నిత్యం అందులో పెట్టి తీసుకెళ్తున్న అబ్బాయి..